చిత్రం: ప్రేమ మూర్తులు (1982)
రచన: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
పల్లవి: లలలలలల... లలలలల... లలలలల... తారక చెప్పదు ఏనాడు... జాబిలి వెన్నెల వీడ్కోలు తారక చెప్పదు ఏనాడు... జాబిలి వెన్నెల వీడ్కోలు ఆకాశానికి ఆ రెండూ... దేవుడు పెట్టిన దీపాలు తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు అనురాగానికి ఆ రెండూ... మమతల హారతి కాబోలు చరణం 1: ఉదయకాంతి నీ పెదవుల మెరిసి... తాంబూలంగా చూస్తుంటా నీలి మబ్బు నీ నీలాల కురులకే... చుక్క మల్లెలే అందిస్తా చిరుగాలులు నీ తాకిడిగా... సెలయేరులు నీ అలికిడిగా నాలో నిన్నే చూసుకుంటూ... కాలం ఇట్టే గడిపేస్తా కాలమంతా కరిగిపోయే కౌగిలింతలు నేనిస్తా తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు ఆకాశానికి ఆ రెండూ... దేవుడు పెట్టిన దీపాలు చరణం 2: వేడి ఆశనై వేసవి గాలుల... వెచ్చని కబురులు పంపిస్తా కలల నీడలే కౌగిళ్లనుకొని... కలవరింతగా కలిసొస్తా నెలవంకలు నీ నవ్వులుగా... కలహంసలు నీ నడకలుగా కావ్యాలెన్నో రాసుకుంటూ... కవినే నీకై వినిపిస్తా కవితలాగా నిలిచిపోయే అనుభవాలే పండిస్తా తారక చెప్పదు ఏనాడు... జాబిలి వెన్నెల వీడ్కోలు ఆకాశానికి ఆ రెండూ... దేవుడు పెట్టిన దీపాలు తారక అడగదు ఏనాడు... పున్నమి వెన్నెల వీడ్కోలు అనురాగానికి ఆ రెండూ... మమతల హారతి కాబోలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి