Preminchu Pelladu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Preminchu Pelladu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, డిసెంబర్ 2024, శుక్రవారం

Preminchu Pelladu : Ee Chaitraveena Song Lyrics (ఈ.. ఛైత్రవీణా)

చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)

సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



పల్లవి :

ఈ.. ఛైత్రవీణా ఝుం..ఝుమ్మనీ...(2)
రొదగ నా ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా...(2)
ఈ.. ఛైత్రవీణా ఝుం..ఝుమ్మనీ...

చరణం:1

లాల.. లాల.. లాల.. లాల.. లాలలాల లాలలా(3)
విడిపోలేనీ విరి తీవెలలొ కురులే మరులై పోతుంటే హోయ్..
ఎడబాటేది ఎదలోతులలొ అదిమే వలపే పుడుతుంటే...
తనువూ తనువూ తరువూ తరువై పుప్పొడి మొగ్గే పెడుతుంటే
పూలే గంధం పూస్తూంటే
తొలిగా నా చెలితో కౌగిలిలో సాగే ప్రేమారాధనా...
ఈ.. ఛైత్రవీణా ఝుంఝుమ్మనీ...(2)

చరణం:2

లా..ల.ల్లాల. లా..ల.ల్లాల. ల.ల.ల.లా.(2)
లలల..లల్లాల. లా.లా.లల్లా.ల. లా.లా.లా.లా.లా..
లల్లలాల. లల్లాలాల. లల్లాలాల. లల్లలాల. లల్లాలాల. లల్లాలాల.
లలలా. ల. ల. ల. ల. ల. ల. లా..హొఇ...
గళమే పాడే కల కోఇలనె వలచీ పిలిచే నా గీతం...హోయ్..
నదులై సాగే ఋతుశోభలనే అభిషేకించే మకరంధం...
గగనం.. భువనం.. కలిసే.. సొగసె.. సంధ్యారాగం అవుతుంటే..
లయలే ప్రియమైపొతుంటే..
వనమే.. యవ్వనమై.. జీవనమై సాగే రాధాలాపనా...
ఈ.. ఛైత్రవీణా...ఝుం..ఝుమ్మనీ..(2)
రొదగ. నా.. ఎదలో తుమ్మెదలా చేసే ప్రేమాలాపనా..

28, మార్చి 2022, సోమవారం

Preminchu Pelladu : Nirantaram Vasanthamule Song Lyrics ( నిరంతరమూ వసంతములే)

చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)

సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి


నిరంతరమూ వసంతములే మందారములా మరందములే స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండె నిరంతరమూ వసంతములే మందారములా మరందములే నిరంతరమూ వసంతములే మందారములా మరందములే స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండె నిరంతరమూ వసంతములే మందారములా మరందములే హాయిగా పాటపాడే కోయిలె మాకు నేస్తం తేనెలో తానమాడె తుమ్మెదే మాకు చుట్టం నదులలో వీణమీటే తెమ్మెరే మాకు ప్రాణం అలలపై నాట్యమాడె వెన్నెలే వేణుగానం ఆకశానికవి తారలా ఆశకున్న విరి దారులా ఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్తుంటె నిరంతరమూ వసంతములే మందారములా మరందములే స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండె నిరంతరము వసంతములే మందారములా మరందములే అగ్నిపత్రాలు రాసి గ్రీష్మమే సాగిపోయే మెరుపులేఖల్లు రాసి మేఘమై మూగవోయే మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే మాఘ దాహాలలోనా అందమే అప్సరాయే మల్లె కొమ్మ చిరునవ్వులా మనసులోని మరు దివ్వెలా ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే నిరంతరమూ వసంతములే మందారములా మరందములే స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండె నిరంతరమూ వసంతములే మందారములా మరందములే

15, జూన్ 2021, మంగళవారం

Preminchu Pelladu : Gopemma Chethilo Song Lyrics (గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద)

చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)

సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద.. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద ముద్దు కావాలా.. ముద్ద కావాలా.. ముద్దు కావాలా.. ముద్ద కావాలా.. ఆ విందా.. ఈ విందా.. నా ముద్దు గోవిందా.. గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద.. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద రాగారంత రాసలీలలు.. అలు అరు ఇణి.. రాగాలైన రాధగోలలు.. అలు అరు ఇణి.. రాధా... రాధా భాధితుణ్ణిలే .. ప్రేమారాధకుణ్ణిలే.. అహా..హా.. జారుపైట లాగనేలరా..ఆరుబైట అల్లరేలరా.. ముద్దు బేరమాడకుండ ముద్దలింక మింగవా.. గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద.. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద ముద్దు కావాలా.. ముద్ద కావాలా.. ముద్దు కావాలా.. ముద్ద కావాలా.. ఆ విందా.. ఈ విందా.. నా ముద్దు గోవిందా.. గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద.. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద వెలిగించాలి నవ్వు మువ్వలు.. అల అల అహహ్హ. తినిపించాలి మల్లె బువ్వలు..ఇల ఇల ఇలా.. కాదా... చూపే లేత శోభనం .. మాటే తీపి లాంఛనం అహ హా.. వాలు జెళ్ళ ఉచ్చులేసినా.. కౌగిలింత ఖైదు వేసినా.. ముద్దు మాత్రం ఇచ్చుకుంటె ముద్దాయల్లె వుండనా.. గోపెమ్మ చెతుల్లో గోరుముద్ద.. రాధమ్మ చెతుల్లో వెన్నముద్ద ముద్దు కావాలి.. ముద్ద కావాలి.. ముద్దు కావాలి.. ముద్ద కావాలి.. ఆ విందూ.. ఈ విందూ .. నా ముద్దు గోవిందా.. గోపెమ్మ చెతుల్లో హ హ హహ్హా.... రాధమ్మ చెతుల్లో హ హ హహ్హా..

Preminchu Pelladu : Vayyari Godaramma Song Lyrics (వయ్యారి గోదారమ్మ)

చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)

సంగీతం : ఇళయరాజా సాహిత్యం : వేటూరి గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం కడలి ఒడిలో కలసిపోతే కల వరం ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో కలవరింతే కౌగిలింతై. వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

నిజము నా స్వప్నం అహా కలనో ఓహో లేనో ఓహో హో నీవు నా సత్యం అహా అవునో ఓహో కానో ఓహో హో ఊహ నీవే ఆహాహాహా. ఉసురుకారాదా. ఆహా మోహమల్లె ఆహాహాహా ముసురుకోరాదా. ఆహా నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ మువ్వగోపాలుని రాధికా ఆకాశవీణ గీతాలలోన ఆలాపనై నే కరిగిపోనా వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం తాకితే తాపం ఓహో కమలం ఓహో భ్రమరం ఓహో హో సోకితే మైకం ఓహో అధరం ఓహో మధురం ఓహో హో ఆటవెలది ఆహాహాహా ఆడుతూరావే హా.ఆఅ తేటగీతి ఆహాహా... హా. తేలిపోనీవే హా.ఆ పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుక చుంబించుకున్న బింభాధరాల సూర్యోదయాలే పండేటి వేళ వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం కడలి ఒడిలో కలసిపోతే కల వరం ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో కలవరింతే కౌగిలింతై. వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం