Puttintiki Ra Chelli లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Puttintiki Ra Chelli లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జనవరి 2024, ఆదివారం

Puttintiki Ra Chelli : Gopala Gopala Gopi Lola Song Lyics (గోపాల గోపాల గోపిలోల)

చిత్రం: పుట్టింటికి రా చెల్లి (2004)

రచన: సాయి శ్రీ హర్ష & సురేంద్ర కృష్ణ

గానం: ఉదిత్ నారాయణ్, సుజాతా మోహన్

సంగీతం: ఎస్. ఎ.రాజ్ కుమార్




గోపాల గోపాల గోపిలోల ఒళ్ళంతా రేపావు ఏదో గోల గోపాల గోపాల గోపిలోల ఒళ్ళంతా రేపావు ఏదో గోల ఎర్రని బుగ్గతో ఎదురొచ్చిన సిగ్గుతో ఒంపులు దాచి నన్ను చంపమాకు అల్లరి నవ్వుతో చురకత్తుల చూపుతో ఇట్టా సంధులోకి లాగమాకు వయ్యారి ఓసారి వచ్చిపోవే స్వర్గాన్నే నీ ముందు దించుతాలే వయ్యారి ఓసారి వచ్చిపోవే స్వర్గాన్నే నీ ముందు దించుతాలే గోపాల గోపాల గోపిలోల ఒళ్ళంతా రేపావు ఏదో గోల ఎర్రని పెదవుల్లో మత్తున్నదే కోడె వయసే ఊగిందే ఎర్రని పెదవుల్లో మత్తున్నదే కోడె వయసే ఊగిందే తడిమే నీ చెయ్యే మహా వాటంగా ఉన్నది బిగిసే వంపుల్లో తెగ కసిరేపుతున్నదీ పలక నడుము కనుక నువ్వు అందుకో ఇక దడక దడక దడకమని ఆగలేనిక అందాల విందుంది సంధకాడ అందింది దోచేయ్యి అందగాడా అందాల విందుంది సంధకాడ అందింది దోచేయ్యి అందగాడా గోపాల గోపాల గోపిలోల ఒళ్ళంతా రేపావు ఏదో గోల

కౌగిలి కొస్తావా కాంతామణి చెక్కిలి ఇస్తావా చింతామణి హే..కౌగిలి కొస్తావా కాంతామణి చెక్కిలి ఇస్తావా చింతామణి వాణి చూపించు ఈ పూ బోణి నీదిరా దాడి చేసైనా నా శృంగార శ్రీమతి చిలుకు చిలుకు నా సోకు చిలకరా తళుకు తళుకు నా జూకు వంకరా ఆకాశం అదరాలి అల్లరోడా పాతళం పొంగాలి చక్కనోడా ఆకాశం అదరాలి అల్లరోడా పాతళం పొంగాలి చక్కనోడా

గోపాల గోపాల గోపిలోల ఒళ్ళంతా రేపావు ఏదో గోల ఓ..ఎర్రని బుగ్గతో ఎదురొచ్చిన సిగ్గుతో ఒంపులు దాచి నన్ను చంపమాకుా అల్లరి నవ్వుతో చురకత్తుల చూపుతో ఇట్టా సంధులోకి లాగమాకు వయ్యారి ఓసారి వచ్చిపోవే స్వర్గాన్నే నీ ముందు దించుతాలే వయ్యారి ఓసారి వచ్చిపోవే స్వర్గాన్నే నీ ముందు దించుతాలే


16, ఆగస్టు 2021, సోమవారం

Puttintiki Ra Chelli : Chamanthi Poobanthi Song Lyrics (చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి)

చిత్రం: పుట్టింటికి రా చెల్లి (2004)

రచన: సాయి శ్రీ హర్ష & సురేంద్ర కృష్ణ

గానం: కె.యస్.చిత్ర

సంగీతం: ఎస్. ఎ.రాజ్ కుమార్



చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో లాలి జో చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా జోలాలి జోజో లాలి జో నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా మన అమ్మను తేనేతేలేడే చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో లాలి జో ఆ కాలం గుచ్చింది కళ్ళల్లో ముళ్ళన్నీ నే తీస్తా ముళ్ళన్నీ నువ్వేలే నాకన్నీ కష్టాలు ఎన్నైనా నీకోసం పడతాను మన అమ్మను తెమ్మంటే ఏ కాళ్ళను పడతాను అమ్మలేని బ్రహ్మ రాత రాసినాడు అమ్మనెత్తుకెళ్లి కోత కోసినాడు నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మా మన కన్న తల్లివి నువ్వమ్మా చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో లాలి జో నేలమ్మకు ఏదమ్మా బువ్వెట్టే వాళ్ళమ్మా ఆకాశంకేదమ్మా ఆడిగిందిచ్చే తన అమ్మా ఆ రాత నీ కేంటి నేనున్నా లోటేంటి నీ తోడే నా లోకం తోడియ్యన నా ప్రాణం ఇందుకే నేను ముందు పుట్టినాను అమ్మ లా చూసే అన్ననైనాను నీ ముందు ప్రాణాలెంతమ్మా నను కన్నమ్మా నీకోసం నేనున్నానమ్మా చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో లాలి జో చిలకమ్మా గోరింకా నేనేగా నీ తల్లింకా జోలాలి జోజో లాలి జో నే జోల పాటవుతా నువ్వు నిద్ర పోతేను నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మా మన అమ్మను తేనేతేలేడే చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జోజో లాలి జో