చిత్రం: రాజ మకుటం (1960)
సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: పి. లీల
సంగీతం: మాస్టర్ వేణు
సడిసేయకో గాలి.. సడిసేయబోకే
సడిసేయకో గాలి.. సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే సడిసేయకే... !! *రత్నపీఠిక లేని రారాజు నా స్వామి మణికిరీటము లేని మహరాజు గాకేమి చిలిపి పరుగుల మాని కొలిచిపోరాదే సడిసేయకే... ఏటి గలగలలకే ఎగసి లేచేనే ఆకు కదలికలకే అదరి చూచేనే నిదుర చెదరిందంటే నేనూరుకోనే సడిసేయకే... పండు వెన్నెలనడిగి పానుపు తేరాదే నీడ మబ్బులదాగు నిదుర తేరాదే విరుల వీవన బూని విసిరి పోరాదే సడిసేయకో గాలి.. సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే సడిసేయకో గాలి..