23, జనవరి 2022, ఆదివారం

Raja Makutam : Sadiseyako Gaali Song Lyrics (సడిసేయకో గాలి.. )

చిత్రం: రాజ మకుటం (1960)

సాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి

గానం: పి. లీల

సంగీతం: మాస్టర్  వేణు


పల్లవి : సడి సెయకో గాలీ సడి సేయబోకే సడి సెయకో గాలీ సడి సేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వలించేనే చరణం 1: రత్నపీఠిక లేని రారాజు నా స్వామీ మణి కిరీటము లేని మహరాజు గాకేమీ చిలిపి పరుగుల మానీ కొలిచి పోరాదే సడి సేయకే... చరణం 2: ఏటి గలగలలకే ఎగసి లేచేనే ఆకు కదలికలకే అదరి చూచేనే నిదుర చెదరిందంటే నేనూరుకోనే సడి సేయకే... చరణం 3: పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే క్రీడ మబ్బుల దాగు నిదుర తేరాదే విరుల వీవెన బూని విసిరిపోరాదే సడి సెయకో గాలీ సడి సేయబోకే సడి సెయకో గాలీ సడి సేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వలించేనే... సడి సెయకో గాలీ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఊ..ఊ..ఊ..ఊ..ఊ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి