చిత్రం: రాజకోట రహస్యం (1971)
రచన: సి.నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల,పి. సుశీల
సంగీతం: విజయ కృష్ణమూర్తి, విజయ ఆనంద్
తొలి సిగ్గుల తొలకరిలో తలవాల్చిన చంద్రముఖి తెరలెందుకు నీకు నాకు దరి జేరవె ప్రియసఖి " నను మరువని దొరవని తెలుసు నను మరువని దొరవని తెలుసు నా మదిలోన ఏముందొ అది నీకు తెలుసు నను వలచిన చెలివని తెలుసు నను వలచిన చెలివని తెలుసు నా ఎదలోన ఏముందొ అది నీకు తెలుసు నను వలచిన చెలివని తెలుసు చరణం 1: చెంపల కెంపులు దోచాలని .. సంపంగి నవ్వులు దూయాలని ఆ .. ఆ .. ఆ చెంపల కెంపులు దోచాలని .. సంపంగి నవ్వులు దూయాలని నడుమున చేయి వేసి నడవాలని!.... నా .. నడుమున చేయి వేసి నడవాలని అంటుంది అంటుంది నీ కొంటె వయసు ....! నను వలచిన చెలివని తెలుసు నా ఎదలోన ఏముందొ అది నీకు తెలుసు నను వలచిన చెలివని తెలుసు... చరణం 2: నీ రాజు తోడుగ నిలవాలని ... ఈ రేడు లోకాల గెలవాలని ఆ .. ఆ .. ఆ నీ రాజు తోడుగ నిలవాలని ... ఈ రేడు లోకాల గెలవాలని బ్రతుకే పున్నమి కావాలని !.... నీ ...బ్రతుకే పున్నమి కావాలని కోరింది కోరింది నీ లేత వయసు ...! నను మరువని దొరవని తెలుసు నా మదిలోన ఏముందొ అది నీకు తెలుసు నను వలచిన చెలివని తెలుసు