చిత్రం: రాజేంద్రుడు గజేంద్రుడు (1993)
రచన: భువన చంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర
సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
పల్లవి:
కుకుకూ కుకుకూ కుకుకూ ఎవరు నీవని అనకు కళ్ళతోనే గుండె తట్టి చూడు ప్రేమ నాడి కాస్త పట్టి చూడు తొలి తొలి వలపుల తలపులో మైమరపులో కుకుకూ కుకుకూ కుకుకూ నీవే నేనని తెలుసు కళ్ళతోనే గుండె తట్టి చూశా ప్రేమ నాడి జాడ పట్టి చూశా తొలి తొలి పరువపు పిలుపులో మైమరపులో కుకుకూ కుకుకూ కుకుకూ కుకుకూ కుకుకూ కుకుకూ చరణం:1 మనసున మెల్లగా ఊయలలూగిన విరహపు మెరుపులు కన్నావా తనువును తాకిన అల్లరి గాలుల కమ్మని గుసగుస విన్నావా కొంగుపట్టి లాగి కొత్తకొత్తగా అబ్బాయి నన్ను చుట్టుకుంటే ఎంత మైకమో అత్తిపత్తి లాగా మెత్త మెత్తగా అమ్మాయి సిగ్గు దాచుకుంటే ఎంత అందమో కుకుకూ కుకుకూ కుకుకూ కుకుకూ కుకుకూ కుకుకూ చరణం:2 నింగికి నేలకి బాటలు వేసిన తొలకరి చినుకుల ఆరాటం విరిసిన పువ్వుల పంచకు చేరిన గడసరి తుమ్మెద కోలాటం చిన్నదాని పాల బుగ్గ ఒంపులో కిలాడి ముద్దు పెట్టుకుంటే ఎన్ని సొంపులో హత్తుకున్న మేని వత్తి గింపులో అల్లాడుతున్న పిల్లవాడికెన్ని చిక్కులో కుకుకూ కుకుకూ కుకుకూ ఎవరు నీవని అనకు కళ్ళతోనే గుండె తట్టి చూడు ప్రేమ నాడి కాస్త పట్టి చూడు తొలి తొలి వలపుల తలపులో మైమరపులో కుకుకూ కుకుకూ కుకుకూ కుకుకూ కుకుకూ కుకుకూ