చిత్రం: రాజేంద్రుడు గజేంద్రుడు (1993)
రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.యస్.చిత్ర
సంగీతం: ఎస్. వి. కృష్ణారెడ్డి
నీలి వెన్నెల జాబిలి...
నీలి వెన్నెల జాబిలి...వీణ నవ్వుల ఆమని
రా మరి.. నా దరి.. అందుకో.. ప్రేమనీ
నీలి కన్నుల కోమలీ...
నీలి వెన్నెల జాబిలి ...
నీలి వెన్నెల జాబిలి.. వీణ నవ్వుల ఆమని
చేరని.. నీ దరి.. పొందనీ.. ప్రేమనీ
రాగ వీధుల సాగనీ...
నావలపుల కోవెల మంటపం...
నీ రాకకు పలికెను స్వాగతం
సిరి మల్లెల రువ్వే సోయగం.....
తొలి ప్రేమకు ఆయేను తోరణం...
ప్రేమలే పెనవేయగా... ఆశలే నెరవేరగా...
అనురాగ సిరులు.. సరసాల సుధలు..మనసార మరులు
పండించు కొందామా...
నీలి వెన్నెల జాబిలి ... వీణ నవ్వుల ఆమని
ఓ చల్లని చూపుల దేవత...
ప్రతి జన్మకు కోరెద నీ జత
నా కుంకుమరేఖల బంధమా...
జత చేరుమ జీవనరాగమా
కాలమా అనుకూలము... కానుకా సుముహూర్తము....
గోరింట పూల.. పొదరింటిలోనా.. నీకంటి దీపమై.. జంట చేరనా...
నీలి కన్నుల జాబిలి... నీల నవ్వుల ఆమని
చేరని.. నీ దరి.. పొందనీ.. ప్రేమనీ
రాగ వీధుల సాగనీ ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి