చిత్రం: రక్త సంబంధం (1962)
సాహిత్యం: అనిసెట్టి సుబ్బారావు
గానం: ఘంటసాల, పి. సుశీల
సంగీతం: ఘంటసాల
చందురుని మించు అందమొలికించు ముద్దుపాపాయివే నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితములిచ్చులే లోకములనేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే అన్న ఒడి జేర్చి ఆటలాడించు నాటి కథ పాడనా నాటి కథ పాడనా కలతలకు లొంగి కష్టముల క్రుంగు నేటి కథ పాడనా కన్నీటి కథ పాడనా కలతలకు లొంగి కష్టముల క్రుంగు కన్నీటి కథ పాడనా కంటిలో పాప ఇంటికే జ్యోతి చెల్లి నా ప్రాణమే చెల్లి నా ప్రాణమే మము విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే మిగిలెనీ శోకమే విధియె విడదీసె వెతలలో ద్రోసే మిగిలెనీ శోకమే చందురునిమించు అందమొలికించు ముద్దుపాపాయివే నిను కన్నవారింట కష్టములనీడ కరగిపోయేనులే మనసులను కలుపు…