Rowdy Gari Pellam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Rowdy Gari Pellam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జనవరి 2025, బుధవారం

Rowdy Gari Pellam : Boyavani Vetuku Song Lyrics (బోయవాని వేటుకు)

చిత్రం: రౌడీ గారి పెళ్ళాం (1991)

సాహిత్యం: గురుచరణ్

గానం: కె. జె. యేసుదాస్

సంగీతం: బప్పీలహరి


పల్లవి :

బోయవాని వేటుకు గాయపడిన కోయిల

బోయవాని వేటుకు గాయపడిన కోయిల

గుండెకోత కోసిన చేసినావు ఊయల

బోయవాని వేటుకు గాయపడిన కోయిల


చరణం:1

తోడులేని నీడలేని గుడులోకి వచ్చింది

ఆడతోడు ఉంటానని మూడు ముళ్ళు వేయమంది

రాయికన్నా రాయిచేత రాగాలు పలికించి

రాక్షసుణ్ని మనిషి చేసి తన దైవం అన్నది

ఏనాటిదో ఈఈ బంధం

బోయవాని వేటుకు గాయపడిన కోయిల


చరణం:2

చేరువైన చెలిమికి చుక్క బొట్టు పెట్టని

కరుణ చిందు కనులకు కాటుకైనా దిద్దని

మెట్టినింటి లక్ష్మికి మెట్టే నన్ను తొడగాని

కాబోయే తల్లికి గాజులైనా వేయని

ఇల్లాలికిదే సీమంతం

బోయవాని వేటుకు గాయపడిన కోయిల

గుండెకోత కోసిన చేసినావు ఊయల

బోయవాని వేటుకు గాయపడిన కోయిల


28, మార్చి 2024, గురువారం

Rowdy Gari Pellam : Yama Ranju Song Lyrics (యమా రంజుమీద)

చిత్రం: రౌడీ గారి పెళ్ళాం (1991)

సాహిత్యం: గురుచరణ్

గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర

సంగీతం: బప్పీలహరి



పల్లవి :

యమా రంజుమీద ఉంది పుంజు అరె జమాయించి దూకుతుంది రోజు తిరుగుబోతు పెట్టని బుట్టకింద పెట్టుకో దుమ్మురేపి పోయాకా అమ్మమ్మో అబ్బబ్బో అనకే రంగసాని యమా రంగు తేలివుంది పెట్టా దాని జమాయింపు దాచలేదు బుట్టా దమ్ములుంటే రమ్మను మెరక ఈది మద్యకి కాలుబారు పుంజువని అప్పుడే చెప్పుకు గొప్పలు రౌడీ మావా యమా రంజుమీద ఉంది పుంజు అరె జమాయించి దూకుతుంది రోజు కోకో కొరుకో...

చరణం:1

బలేబారు పుంజువని పొదల్లోకి లాగి పిచ్చివేషాలేశావంటే పట్టుకొని లాగుతాను రెండు జడలు రెండు జడలుపట్టి లాగినా జారుపైట జారినా నిన్ను విడిచి పెట్టదురో వగల సెగల గుబులుమారి పెట్ట వడేసి పట్టా వగలమారి పెట్టకి వాటమైన పుంజుకి ముచ్చటంత తీరేదాకా కచ్చి పిచ్చి రెచ్చి పోవునులే యమా రంగు తేలివుంది పెట్టా దాని జమాయింపు దాచలేదు బుట్టా య యమా రంజుమీద ఉంది పుంజు అరెరే జమాయించి దూకుతుంది రోజు

చరణం:2

ఊరువాడ నాదేనని ఒళ్ళు విరుచుకుంటే కళ్ళముందే ముగ్గులోకి దించుతాది బలే కౌజు పిట్టా వాటేసి పట్టా రెక్కవిప్పి కొట్టేనంటే చుక్కలు పడతాయి హే ముక్కు పోటు తగెలనంటే ముచ్చటంత తీరతాదే పెట్టా ఎగిగి కొట్టా ఎగిరి దెబ్బకొట్టినా వగలముద్దు పెట్టినా ఈడు జోడు వేడిపుడితె హద్దు పద్దు లేదు రౌడీ మావా యమా రంజుమీద ఉంది పుంజు అరె జమాయించి దూకుతుంది రోజు తిరుగుబోతు పెట్టని బుట్టకింద పెట్టుకో దుమ్మురేపి పోయాకా అమ్మమ్మో అబ్బబ్బో అనకే రంగసాని యమా రంగు తేలివుంది పెట్టా దాని జమాయింపు దాచలేదు బుట్టా దమ్ములుంటే రమ్మను మెరక ఈది మద్యకి కాలుబారు పుంజువని అప్పుడే చెప్పుకు గొప్పలు రౌడీ మావా యమా రంజుమీద ఉంది పుంజు అరె జమాయించి దూకుతుంది రోజు రోజు రోజు...