చిత్రం: రౌడీ గారి పెళ్ళాం (1991)
సాహిత్యం: గురుచరణ్
గానం: కె. జె. యేసుదాస్
సంగీతం: బప్పీలహరి
పల్లవి :
బోయవాని వేటుకు గాయపడిన కోయిల
బోయవాని వేటుకు గాయపడిన కోయిల
గుండెకోత కోసిన చేసినావు ఊయల
బోయవాని వేటుకు గాయపడిన కోయిల
చరణం:1
తోడులేని నీడలేని గుడులోకి వచ్చింది
ఆడతోడు ఉంటానని మూడు ముళ్ళు వేయమంది
రాయికన్నా రాయిచేత రాగాలు పలికించి
రాక్షసుణ్ని మనిషి చేసి తన దైవం అన్నది
ఏనాటిదో ఈఈ బంధం
బోయవాని వేటుకు గాయపడిన కోయిల
చరణం:2
చేరువైన చెలిమికి చుక్క బొట్టు పెట్టని
కరుణ చిందు కనులకు కాటుకైనా దిద్దని
మెట్టినింటి లక్ష్మికి మెట్టే నన్ను తొడగాని
కాబోయే తల్లికి గాజులైనా వేయని
ఇల్లాలికిదే సీమంతం
బోయవాని వేటుకు గాయపడిన కోయిల
గుండెకోత కోసిన చేసినావు ఊయల
బోయవాని వేటుకు గాయపడిన కోయిల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి