Sakhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sakhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మే 2022, శుక్రవారం

Sakhi : Snehithudaa Song Lyrics (నిన్న మునిమాపుల్లో )

చిత్రం: సఖి(2000)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: వేటూరి

గానం: సాధన సర్గం, శ్రీనివాస్



నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమనిచెను లే నా గర్వమనిగెను లే స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా... చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం... ఇదే వలపు గెలుపు... శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంచలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్ ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్ మనసే మధువోయ్ పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్ సందెల్లో తోడువోయ్ ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు సాయవలెరా ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా... చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమనిచెను లే నా గర్వమనిగెను లే శాంతించాలి పగలేంటి పనికే (2) నీ సొంతానికి తెచ్చేదింక పడకే వాలే పొద్దు వలపే వూలెన్ చొక్క ఆరబోసే వయసే నీటీ చెమ్మ చెక్క లైనా నాకు వరసే ఉప్పు మూటే అమ్మై నా ఉన్నట్టుండి తీస్తా ఎత్తేసి విసిరేస్తా కొంగుల్లో నిన్నే దాచేస్తా వాలక పొద్దు విడుదల చేసి వరమొకటడిగేస్తా స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా... చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం... ఇదే వలపు గెలుపు... శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంచలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా

21, ఏప్రిల్ 2022, గురువారం

Sakhi : Kailove Chedugudu Song Lyrics (కాయ్ లవ్ చెడుగుడుగుడు)

చిత్రం: సఖి(2000)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చరణ్, నవీన్



కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు (4) అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలలే నను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే తొలిగా పాడే ఆ పల్లవి ఔనేలే దరికే వస్తే లేనంటావే నగిళ నగిళ నగిళ ఓహోహో బిగువు చాలే నగిళా(2) ఓహో పడుచు పాట నెమరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కునుకు పట్టి ఏదో కోరే నన్నే కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నె ఉడుకుడు (4) నీళ్లోసే ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్ వేదిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందోయ్ నేనొచ్చి తాకానో ముల్లల్లే పొడిచేనోయ్ తానొచ్చి తాకిందో పువ్వల్లె అయ్యేనోయ్ కన్నీరే పన్నీరై ఉందామే రావేమే నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే నీ అందం నీ చందం నీకన్నా ఎవరు లే నగిళ నగిళ నగిళ ఒహోహో బిగువు చాలే నగిళ (2) ఉద్దేశ్యం తెలిసాక ఆయుష్షే పోలేదు సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు నా గాధ ఏదైనా ఊరించే నీ తోడు ఎంతైనా నా మోహం నీదమ్మ ఏనాడూ కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలే చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే నీ వెంటే పిల్లాడై వస్తానే ప్రణయమా

30, అక్టోబర్ 2021, శనివారం

Sakhi : Sakhiya Cheliya lyrics (సఖియా... చెలియా)

చిత్రం: సఖి(2000)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: వేటూరి

గానం: హరిహరన్



సఖియా... చెలియా... కౌగిలి..కౌగిలి..కౌగిలి..చెలి పండు.. సఖియా... చెలియా... నీ ఒంపే..సొంపే..తొణికిన తొలి పండు.. పచ్చందనమే పచ్చదనమే.. తొలి తొలి వలపే పచ్చదనమే.. పచ్చిక నవ్వుల పచ్చదనమే.. ఎదకు సమ్మతం చెలిమే... ఎదకు సమ్మతం చెలిమే... పచ్చందనమే పచ్చదనమే.. ఎదిగే పరువం పచ్చదనమే.. నీ చిరునవ్వు పచ్చదనమే.. ఎదకు సమ్మతం చెలిమే.. ఎదకు సమ్మతం చెలిమే... ఎదకు సమ్మతం చెలిమే... కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు.. ఎర్రముక్కులే పిల్ల వాక్కు .. పువ్వై పూసిన ఎర్ర రోజా.. పూత గులాబి పసి పాదం.. ఎర్రని రూపం ఉడికే కోపం.. ఎర్రని రూపం ఉడికే కోపం.. సంధ్యావర్ణ మంత్రాలు వింటే.. ఎర్రని పంట పాదమంటే.. కాంచనాల జిలుగు పచ్చ.. కొండబంతి గోరంత పచ్చ.. పచ్చా... పచ్చా... పచ్చా... మసకే పడితే మరకత వర్ణం.. అందం చందం అలిగిన వర్ణం.. సఖియా... చెలియా... కౌగిలి..కౌగిలి..కౌగిలి..చెలి పండు.. సఖియా... చెలియా... నీ ఒంపే..సొంపే..తొణికిన తొలి పండు.. అలలే లేని సాగర వర్ణం.. మొయిలే లేని అంబర వర్ణం.. మయూర గళమే వర్ణం.. గుమ్మాడి పూవు తొలి వర్ణం.. ఊదా పూరెక్కలపై వర్ణం.. ఎన్నో చేరేని కన్నె గగనం.. నన్నే చేరే ఈ కన్నె భువనం.. రాత్రి నలుపే రంగు నలుపే.. వానాకాలం మొత్తం నలుపే.. కాకి రెక్కల్లో కారునలుపే.. కన్నె కాటుక కళ్లు నలుపే.. విసిగి పాడే కోయిల నలుపే.. నీలాంబరాల కుంతల నలుపే.. నీలాంబరాల కుంతల నలుపే.. సఖియా... చెలియా... కౌగిలి..కౌగిలి..కౌగిలి..చెలి పండు.. సఖియా... చెలియా... నీ ఒంపే..సొంపే..తొణికిన తొలి పండు.. తెల్లని తెలుపే ఎద తెలిపే.. వానలు కడిగిన తుమి తెలుపే.. తెల్లని తెలుపే ఎద తెలిపే.. వానలు కడిగిన తుమి తెలుపే.. ఇరు కనుపాపల కథ తెలిపే.. ఉన్న మనసు తెలిపే.. ఉడుకు మనసు తెలిపే.. ఉరుకు మనసు తెలిపే..

Sakhi : Kalalai Poyenu Song (కలలై పోయెను నా ప్రేమలూ)

చిత్రం: సఖి(2000)

సంగీతం: ఏ.ఆర్.రెహమాన్

సాహిత్యం: వేటూరి

గానం: స్వర్ణలత



ప్రేమలే నేరమా ప్రియా ప్రియా వలపు విరహమా ఓ నా ప్రియా మనసు మమత ఆకాశమా ఒక తారై మెరిసిన నీవెక్కడో...

కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ మదికే అతిధిగ రానేలనో శెలవైనా అడగక పోనేలనో ఎదురు చూపుకు నిదరేదీ ఊగెను ఉసురే కన్నీరై మనసు అడిగిన మనిషెక్కడో నా పిలుపే అందని దూరాలలో... కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ

అనురాగానికి స్వరమేది సాగరఘోషకు పెదవేది అనురాగానికి స్వరమేది సాగరఘోషకు పెదవేది ఎవరికివారే ఎదురుపడి ఎదలు రగులు ఎడబాటులలో చివరికి దారే మెలికపడి నిను చేరగ నేనీ శిలనైతిని ఎండమావిలో నావను నే ఈ నిట్టూర్పే నా తెరచాపలే కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ

వెన్నెల మండిన వేదనలో కలువ పువ్వులా కలతపడి వెన్నెల మండిన వేదనలో కలువ పువ్వులా కలతపడి చేసిన బాసలు కలలైపోతే బతుకే మాయగ మిగులుననీ నీకై వెతికా కౌగిలినై నీడగ మారిన వలపులతో అలిసి ఉన్నాను ఆశలతో నను ఓదార్చే నీ పిలుపెన్నడో

కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ కలలై పోయెను నా ప్రేమలూ అలలై పొంగెను నా కన్నులూ