Salaar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Salaar లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జనవరి 2025, మంగళవారం

Salaar : Prathi Gaadhalo Song Lyrics (ప్రతి గాధలో రాక్షసుడే)

చిత్రం : సాలార్ (2023)

సంగీతం : రవి బస్రూర్

గీత రచయిత : కృష్ణకాంత్

నేపధ్య గానం : సచిన్ బస్రూర్



పల్లవి:

ప్రతి గాధలో రాక్షసుడే హింసలు పెడతాడు అణచగనే పుడతాడు రాజే ఒకడూ ప్రతి గాధలో రాక్షసుడే హింసలు పెడతాడు అణచగనే పుడతాడు రాజే ఒకడూ శత్రువునే కడదేర్చే పనిలో మన రాజు హింసలనే మరిగాడు మంచిని మరిచే ఆ నీచుడి అంతు చూసాడు పంథంతో పోరాడి క్రోధంతో మారిపోయాడు తానే ఒక రక్కసుడై సాధించే గుణం ఉండాలి బలవంతుడైన ఎదిరించాలి మీ ఓర్పు నేర్పునిక చాటాలి గెలవాలంటె మన్నించాలి కోపం మరి లోపం అవ్వదా యుద్ధమైనా చిరునవ్వుతోనే నువు… ఆపేసి చూపాలిరా నీ ఒప్పులలా మిగలాలిరా ఆ శిలపైనే ఒక రాతలా నీ తప్పులలా చెరగాలిరా ఆ ఇసుకలపై ఒక గీతలా

చరణం 1:

తలనే దించెయ్ జగడాలకే పోకురా పగనే తుంచెయ్ అది ఎప్పుడూ కీడురా నిజమను ధైర్యం అండరా కరుగును దేహం కండరా తెలివితో లోకం ఏలరా, నిలబడరా మనదను స్వార్ధం వీడరా మనిషికి మాటే నీడరా ఇచ్చిన మాటే తప్పితే, గెలవవురా కోపం మరి లోపం అవ్వదా యుద్ధమైనా చిరునవ్వుతోనే నువు… ఆపేసి చూపాలిరా నీ ఒప్పులలా మిగలాలిరా ఆ శిలపైనే ఒక రాతలా నీ తప్పులలా చెరగాలిరా ఆ ఇసుకలపై ఒక గీతలా

Salaar : Vinaraa Song Lyrics (వినరా వినరా ఈ పగలు వైరం)

చిత్రం : సాలార్ (2023)

సంగీతం : రవి బస్రూర్

గీత రచయిత : కృష్ణకాంత్

నేపధ్య గానం : సచిన్ బస్రూర్


వినరా వినరా ఈ పగలు వైరం
మధ్యన త్యాగంరా
వినరా ఆ పగలు వైరం
మధ్యన స్నేహంరా
వినరా రగిలే మంటల
మధ్యల మంచేరా
వినరా మరిగే గరళం
మధ్యన జీవంరా

క్రోధాలే నిండిన లోకంరా
స్వార్ధాలే అంటని బంధంరా
మాట ఇచ్చాడో తానె అవ్తాడురా ఎరా
కోపగించాడో తానె అవ్తాడురా సొరా

మోసాలే నిండిన లోకంరా
వేలంటూ మరవని బంధంరా
దూసుకొచ్చాడో తానె అవుతాడురా చెరా
తాను నమ్మాడో విననే వినదంటరా మొరా

Salaar : Sooreede Song Lyrics (సూరీడే గొడుగు పట్టి)

చిత్రం : సాలార్ (2023)

సంగీతం : రవి బస్రూర్

గీత రచయిత : కృష్ణ కాంత్

నేపధ్య గానం : హరిణి ఇవటూరి


పల్లవి:

సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు
రెప్పనొదలక కాపు కాసెడి కన్ను వాడూ
ఆకాశం ఇడిసిపెట్టి
ముద్దెట్టె పొలము మట్టి
ఎండ భగ భగ తీర్చే
చినుకుల దూకుతాడూ
ముప్పు కలగక ముందు
నిలబడి ఆపుతాడూ

చరణం 1:

ఏ ఏ ఖడ్గమొకడైతే
కలహాలు ఒకడివిలే
ఒకడు గర్జన ఒకడు ఉప్పెన
వెరసి ప్రళయాలే
సైగ ఒకడు సైన్యమొకడు
కలిసి కదిలితే కధనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే
నూరెళ్లు నిలవాలే

చరణం 2:

ఏ ఏ ఏ కంచె ఒకడైతే
అది మించె వాడొకడే
ఒకడు చిచ్చుర ఒకడు తెమ్మెర
కలిసి ధహనాలే
వేగమొకడు త్యాగమొకడు
గతము మరువని గమనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన
స్నేహమే ఇదిలే
నూరేళ్ళు నిలవాలే
సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు
రెప్పనొదలక కాపు కాసెడి కన్ను వాడూ