చిత్రం : సాలార్ (2023)
సంగీతం : రవి బస్రూర్
గీత రచయిత : కృష్ణకాంత్
నేపధ్య గానం : సచిన్ బస్రూర్
పల్లవి:
ప్రతి గాధలో రాక్షసుడే
హింసలు పెడతాడు
అణచగనే పుడతాడు
రాజే ఒకడూ
ప్రతి గాధలో రాక్షసుడే
హింసలు పెడతాడు
అణచగనే పుడతాడు
రాజే ఒకడూ
శత్రువునే కడదేర్చే పనిలో
మన రాజు
హింసలనే మరిగాడు
మంచిని మరిచే
ఆ నీచుడి అంతు చూసాడు
పంథంతో పోరాడి
క్రోధంతో మారిపోయాడు
తానే ఒక రక్కసుడై
సాధించే గుణం ఉండాలి
బలవంతుడైన ఎదిరించాలి
మీ ఓర్పు నేర్పునిక చాటాలి
గెలవాలంటె మన్నించాలి
కోపం మరి లోపం అవ్వదా
యుద్ధమైనా చిరునవ్వుతోనే
నువు… ఆపేసి చూపాలిరా
నీ ఒప్పులలా మిగలాలిరా
ఆ శిలపైనే ఒక రాతలా
నీ తప్పులలా చెరగాలిరా
ఆ ఇసుకలపై ఒక గీతలా
చరణం 1:
తలనే దించెయ్ జగడాలకే పోకురా పగనే తుంచెయ్ అది ఎప్పుడూ కీడురా నిజమను ధైర్యం అండరా కరుగును దేహం కండరా తెలివితో లోకం ఏలరా, నిలబడరా మనదను స్వార్ధం వీడరా మనిషికి మాటే నీడరా ఇచ్చిన మాటే తప్పితే, గెలవవురా కోపం మరి లోపం అవ్వదా యుద్ధమైనా చిరునవ్వుతోనే నువు… ఆపేసి చూపాలిరా నీ ఒప్పులలా మిగలాలిరా ఆ శిలపైనే ఒక రాతలా నీ తప్పులలా చెరగాలిరా ఆ ఇసుకలపై ఒక గీతలా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి