Sangarshana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sangarshana లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, జనవరి 2022, శుక్రవారం

Sangarshana : Niddura Pora o Vayasa| Song Lyrics (నిద్దురపోరా ఓ వయసా)

చిత్రం:  సంఘర్షణ (1983)

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి




లలలలలలా లలలలలలా నిద్దురపోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళ నిద్దురపోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళ ఎంతని ఊపను ఉయ్యాల ఎంతని ఊపను ఉయ్యాల ఏమని పాడను ముద్దుల జోలా  జోజోజోజో లాలీ జోజో ఓ ఓ జోజోజోజో లాలీ జోజో ఓ ఓ నిద్దురపోవే ఓ వయసా బుద్ధిగ ఈ వేళ నిద్దురపోవే ఓ వయసా బుద్ధిగ ఈ వేళ ఎంతని ఓపను నీ గోల ఎంతని ఓపను నీ గోల ఏమని పాడను వెచ్చని జోలా  జోజోజోజో లాలీ జోజో ఓ ఓ జోజోజోజో లాలీ జోజో ఓ ఓ మసకైనా పడనీవూ మల్లె విచ్చుకోనీవూ  హవ్వ హవ్వ హవ్వా  మాటు మణిగిపోనీవూ చాటు చూసుకోనీవూ హవ్వ హవ్వ హవ్వా  వేళాపాళా లేదాయే పాలకి ఒకటే గోలాయే చెపితేనేమో వినవాయే చెప్పకపోతే గొడవాయే బజ్జోమంటే తంటాలా ఎప్పుడు పడితే అపుడేనా జోజోజోజో లాలీ జోజో ఓ ఓ జోజోజోజో లాలీ జోజో ఓ ఓ నిద్దురపోవే ఓ వయసా బుద్ధిగ ఈ వేళ నిద్దురపోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళ మనసైనా పడనీవూ మాట చెప్పుకోనీవూ హవ్వ హవ్వ హవ్వా  లాల పోసుకోనీవూ పూలు ముడుచుకోనీవూ హవ్వ హవ్వ హవ్వా  వెండీ గిన్నె తేవాయే వెన్నెలబువ్వే కరువాయే చలిగాలేస్తే సలుపాయే వెచ్చని గాలికి వలపాయే తాకంగానే తాపాలా ఆనక అంటే అల్లరేనా జోజోజోజో లాలీ జోజో ఓ ఓ జోజోజోజో లాలీ జోజో ఓ ఓ నిద్దురపోరా ఓ వయసా బుద్ధిగ ఈ వేళ నిద్దురపోవే ఓ వయసా బుద్ధిగ ఈ వేళ ఎంతని ఊపను ఉయ్యాల ఎంతని ఓపను నీ గోల ఏమని పాడను ముద్దుల జోలా  జోజోజోజో లాలీ జోజో ఓ ఓ జోజోజోజో లాలీ జోజో ఓ ఓ

21, ఆగస్టు 2021, శనివారం

Sangarshana : Kattu Jari Potaundi Song Lyrics (కట్టు జారి పోతా ఉందీ)

చిత్రం:  సంఘర్షణ (1983)

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల



పల్లవి: కట్టు జారి పోతా ఉందీ చీర కట్టు జారి పోతా ఉందీ హోయ్.. బొట్టు కారి పోతా ఉంది.. చుక్క బొట్టు కారి పోతా ఉందీ..హోయ్ ఒట్టమ్మో ఒళ్లంతా ఉలికి ఉలికి పడతా ఉందీ.. ఏందమ్మ వయ్యారం ఎదిగి ఎదిగి పోతా ఉందీ... అరే...కట్టు జారి పోతా ఉందా...హోయ్ చీర కట్టు జారి పోతా ఉందా..హా బొట్టు కారి పోతా ఉందా...హోయ్ చుక్క బొట్టు కారి పొతా ఉందా...హా ఓలమ్మీ సిగ్గంతా తొణికి తొణికి పోతా ఉందా..హా ఏందమ్మో సింగారం ఎలిగి ఎలిగి పోతా ఉందా... కట్టు జారి పోతా ఉందీ చీర కట్టు జారి పోతా ఉందీ చరణం 1: మొగ్గమ్మ చూసింది పువ్వమ్మ నవ్వింది మొగ్గమ్మ చూసింది పువ్వమ్మ నవ్వింది గోరంతా ఈ గొడవ ఊరంతా చెప్పిందమ్మ పరువంతా తీసిందమ్మా... సోకమ్మ తాకింది కోకమ్మ తరిగింది సోకమ్మ తాకింది కోకమ్మ తరిగింది కాకమ్మ ఆ కబురు కథలాగా చెప్పిందమ్మా..ఆ.ఆ కలలెన్నో రేపిందమ్మా... చీరకట్టలేని చిన్నదానికింక సారె పెట్టనేల చిన్నోడు పొంచి పట్టుకున్న కంచి పట్టు చీర కాకపోతినేల ఈనాడు పొంచి పట్టుకున్న కంచి పట్టు చీర కాకపోతినేల ఈనాడు బొట్టు కారి పోతా ఉంది.. చుక్క బొట్టు కారి పోతా ఉందీ.. చరణం 2: పిట్టమ్మ చూసిందీ..చెట్టెక్కి కూసిందీ.. పిట్టమ్మ చూసిందీ..చెట్టెక్కి కూసిందీ.. బిడియాల కడకొంగు ముడి పెట్టుకోమందమ్మా ముద్దెట్టుకోమందమ్మా... సిగ్గమ్మ వచ్చింది.. శెలవంటు వెళ్ళింది .. సిగ్గమ్మ వచ్చింది ...శెలవంటు వెళ్ళింది ఒక నాటి చెలికాడి ఒడి చేరుకోమందమ్మా ఒదిగొదిగి పొమ్మందమ్మా... పుట్టగానే చెయ్యి పట్టుకున్న ప్రేమ పూతకొచ్చెనమ్మ ఈనాడు చిన్నవాడి కళ్ళు చీర కున్న గళ్ళు ఎట్టదాచనమ్మ నా ఈడు... చిన్నవాడి కళ్ళు చీర కున్న గళ్ళు ఎట్టదాచనమ్మ నా ఈడు అరే...కట్టు జారి పోతా ఉందా...హోయ్ చీర కట్టు జారి పోతా ఉందా..హ హా బొట్టు కారి పోతా ఉందీ.. చుక్క బొట్టు కారి పోతా ఉందీ.. ఓలమ్మీ సిగ్గంతా తొణికి తొణికి పోతా ఉందా..హ హ హ హ హా ఏందమ్మ వయ్యారం ఎదిగి ఎదిగి పోతా ఉందీ... కట్టు జారి పోతా ఉందీ చీర కట్టు జారి పోతా ఉందీ

20, ఆగస్టు 2021, శుక్రవారం

Sangarshana : Sannajaji Pandri Kinda Song Lyrics (సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా)

చిత్రం:  సంఘర్షణ (1983)

సంగీతం: చక్రవర్తి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల



సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ అరె సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ పామే వచ్చి నిన్ను చూసి తోకా ఎత్తి నిలబడిపోయి పడగా విప్పి బుస్సుమంటే  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం  సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ అరె సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ పామే వచ్చి నిన్ను చూసి తోకా ఎత్తి నిలబడిపోయి పడగా విప్పి బుస్సుమంటే  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం  ముద్దులివ్వకుంటే ముల్లు గుచ్చుకుంటదీ  కాదు కూడదంటే కాలి కస్సుమంటదీ  ఒప్పుకోవమ్మా తప్పుకోకమ్మా  పైట లాగకుంటే పల్లె ఎత్తుకుంటదీ హా హా హహా గుట్టు తాపుకుంటే గుండె కొట్టుకుంటదీ హొయ్ హొయ్ హొయ్ హొయ్  అల్లుకోవయ్యా అరె ఆదుకోవయ్యా చీకటి పిచ్చి ముదిరిందంటే  వెన్నెల పెళ్ళి కుదిరిందంటే  కొత్తలవాటు కొంపకు చేటూ ఊ  అయినా తప్పదు ఆటుపోటూ  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం  సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా అరె దూరి దూరి పోయావంటే పాములుంటాయ్  గాజు చిట్లకుండా మోజు తగ్గనంటదీ  ఇద్దరున్న కాడా హద్దులెందుకంటదీ  బెట్టు చాలయ్యా నన్నంటుకోవయ్యా తప్పు చెయ్యకుంటే నిప్పు అంటుకుంటదీ హా హా హహా అందమైన ఈడు అప్పుపెట్టమంటదీ హొయ్ హొయ్ హొయ్ హొయ్  పెట్టిపోవమ్మో అరువెట్టిపోవమ్మో  రెప్పలగంట కొట్టిందంటే  జంటకు గంట గడవాలంటే  వాముల పాటు పాముల కాటూ  వయసుల వాటు ప్రేమల కాటూ  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం  సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ పామే వచ్చి నిన్ను చూసి తోకా ఎత్తి నిలబడిపోయి పడగా విప్పి బుస్సుమంటే  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం  సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా దూరి దూరి పోయావంటే పాములుంటాయ్ పామే వచ్చి నిన్ను చూసి తోకా ఎత్తి నిలబడిపోయి పడగా విప్పి బుస్సుమంటే  ఢంచికు ఢంచికు ఢంచికు ఢుం