Sankarabharanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sankarabharanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, మార్చి 2022, సోమవారం

Sankarabharanam : Omkaara Naadaanusandhanam Song Lyrics

చిత్రం: శంకరాభరణం (1980)

సాహిత్యం: వేటూరి

సంగీతం: కె.వి.మహదేవన్

గానం: గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి


ఓం... ఓం... ఓంకార నాదానుసంధానమౌ గానమే. శంకరాభరణమూ ఓంకార నాదానుసంధానమౌ గానమే. శంకరాభరణమూ శంకరా భరణమూ. శంకర గళ నిగళమూ... శ్రీహరి పద కమలమూ శంకర గళ నిగళమూ... శ్రీహరి పద కమలమూ రాగరత్న మాలికా తరళము. శంకరాభరణమూ శారద వీణా... ఆ... ఆ... ఆ... ఆ. శారద వీణా రాగ చంద్రికా. పులకిత శారద రాత్రమూ శారద వీణా రాగ చంద్రికా. పులకిత శారద రాత్రమూ నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతమూ నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతమూ రసికులకనురాగమై. రసగంగలో తానమై.యీ రసికులకనురాగమై. రసగంగలో తానమై.యీ పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణమూ శంకరా భరణమూ... అద్వైత సిద్ధికి. అమరత్వ లబ్ధికి. గానమె సొపానమూ అద్వైత సిద్ధికి. అమరత్వ లబ్ధికి. గానమె సొపానమూ సత్వ సాధనకు. సత్య శోధనకు. సంగీతమే ప్రాణమూ సత్వ సాధనకు. సత్య శోధనకు. సంగీతమే ప్రాణమూ త్యాగరాజ హృదయమై. రాగరాజ నిలయమై. త్యాగరాజ హృదయమై. రాగరాజ నిలయమై. ముక్తినొసగు భక్తి యోగ మార్గము మృతియెలేని సుధాలాప స్వర్గము శంకరాభరణమూ... ఓంకార నాదానుసంధానమౌగానమే శంకరాభరణమూ పా... దాని... శంకరాభరణము పమగరి గమపదని. శంకరాభరణము సరిసా నిదప నిసరి దపమ గరిగ పమగ పమద పనిద సనిగరి శంకరాభరణమూ ఆహా దపా దమా మాపాదపా... మాపాదపా దపా దమా మదపామగా... మదపామగా గమమదదనినిరి మదదనినిరిరిగ నిరిరిగగమమద సరిరిససనినిదదప. శంకరాభరణమూ రీససాస రిరిసాస రీసాస సరిసరీస రిసరీస రీసనిద నీ నీ నీ దాదనీని దదనీని దానీని దరిస దనిస దని దగరిసానిదప దా దా ద గరిగా మమగా గరిగా మమగా గరి గమపగా మపద మదపమ గరిసరి సరిగసరీ గరి మగపమదప మగపమదప నిదపమదప నిదసనిదప నిదసనిరిస గరీసా గరిసనిదరీసా రిసనిదపసా గరిసనిద నిసనిదప సనిదపమ నీసాని నిసనిదపనీదా సనిదపమపా రిసనిదప సరిదపమ గమమగరిగమదా నిసనిపద మపా నిసనిదప నీ దపమగరి రిసనిదప మగరిసరిసని... శంకరాభరణము శంకరాభరణమూ

Sankarabharanam : Samaja Varagamana Song

చిత్రం: శంకరాభరణం (1980)

సాహిత్యం: త్యాగరాజ

సంగీతం: కె.వి.మహదేవన్

గానం: గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి



సామజ వరగమనా సాధుహృత్ సార సాబ్జపాల కాలాతీత విఖ్యాత సామజ వరగమనా సామని గమజ సుధామయగాన విచక్షణ గుణశీల దయాలవాల మాంపాలయ సామజ వరగమనా ఆమని కోయిలా ఇలా _ నా జీవన వేణువులూదగా మధుర లాలసల మధు పలాలనల _ పెదవిలోని మధువులాను వ్రతముపూని జతకు చేరగా నిసా _ దనీ మదా గమా సమమగ గదదమ మనినిద సనిదమ దనిసా దనిసా గదదమ మనినిద దససని గసనిద నిసగ నిసగ సమగమ గససని నిగసగ సనినిద దనినిద మదదని గమదని సనిదమగస సామజవరగమనా వేసవి రేయిలా ఇలా నా ఎదలో మల్లెలు చల్లగా మదిని కోరికలు మదన గీతికలు పరువమంత విరులపాన్పు పరచి నిన్ను పలుకరించగా గమా గమదమగమా గమనిదమదా మదనిసదనీని నీని మదనీనినీని గమదా దదదదానీ మదనీని నీదమగసా సాసా సానీ సదా సగమద గమదని గమదని మదనిస మదనిస దనిసగమా ఆ ఆ ఆ

19, మార్చి 2022, శనివారం

Sankarabharanam : Dorakunaa Ituvanti Seva Song

చిత్రం: శంకరాభరణం (1980)

సాహిత్యం: వేటూరి

సంగీతం: కె.వి.మహదేవన్

గానం: గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , వాణి జయరామ్



దొరకునా...దొరకునా...దొరకునా... దొరకునా ఇటువంటి సేవ దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు నిర్వాన సోపాన మధిరోహణము సేయు త్రోవా దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు నిర్వాన సోపాన మధిరోహణము సేయు త్రోవా రాగలనంతాలు నీ వేయి రూపాలు భవరోగతిమిరాల పోకార్చు దీపాలు రాగలనంతాలు నీ వేయి రూపాలు భవరోగతిమిరాల పోకార్చు దీపాలు నాదాత్మకుడవై...నాలోన చెలగి నా ప్రాణదీపమై నాలోన వెలిగే... ఆ..ఆ..ఆ... నాదాత్మకుడవై...నాలోన చెలగి నా ప్రాణదీపమై నాలోన వెలిగే... నిను కొల్చువేళ దేవాధిదేవా... దేవాధిదేవా..ఆ... దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు నిర్వాన సోపాన మధిరోహణము సేయు త్రోవా ఉచ్చ్వాస నిస్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు నడలు యెదలోని సడులె మృదంగాలు ఉచ్చ్వాస నిస్వాసములు వాయులీనాలు స్పందించు నవనాడులే వీణాగానాలు నడలు యెదలోని సడులె మృదంగాలు నాలోని జీవమై నాకున్న దైవమై వెలిగొందు వేళ మహానుభావా మహానుభావా.... దొరకునా ఇటువంటి సేవ నీపద రాజీవముల చేరు నిర్వాన సోపాన మధిరోహణము సేయు త్రోవా దొరకునా ఇటువంటి సేవ దొరకునా... ఇటువంటి సేవ

6, ఆగస్టు 2021, శుక్రవారం

Sankarabharanam : Sankaraa Naadasareeraparaa Song Lyrics ( శంకరా... నాదశరీరా పరా...)

చిత్రం: శంకరాభరణం (1980)

సాహిత్యం: వేటూరి

సంగీతం: కె.వి.మహదేవన్

గానం: గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం


పల్లవి : శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా.. జీవేశ్వరా శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా...  చరణం 1 : ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ... మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ... ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ... మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ... నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా... విని తరించరా ... శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా...  చరణం 2 : మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు పరవశాన శిరసూగంగా...  ధరకు జారెనా శివగంగా పరవశాన శిరసూగంగా...  ధరకు జారెనా శివగంగా నా గానలహరి నువు మునుగంగ ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ.. శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా... శంకరా... శంకరా...