6, ఆగస్టు 2021, శుక్రవారం

Sankarabharanam : Sankaraa Naadasareeraparaa Song Lyrics ( శంకరా... నాదశరీరా పరా...)

చిత్రం: శంకరాభరణం (1980)

సాహిత్యం: వేటూరి

సంగీతం: కె.వి.మహదేవన్

గానం: గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం


పల్లవి : శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా.. జీవేశ్వరా శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా...  చరణం 1 : ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ... మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ... ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ... మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ... నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా... విని తరించరా ... శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా...  చరణం 2 : మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు పరవశాన శిరసూగంగా...  ధరకు జారెనా శివగంగా పరవశాన శిరసూగంగా...  ధరకు జారెనా శివగంగా నా గానలహరి నువు మునుగంగ ఆనందవృష్టి నే తడవంగా ఆ... ఆ... ఆ... ఆ.. శంకరా... నాదశరీరా పరా... వేదవిహారా హరా జీవేశ్వరా శంకరా... శంకరా... శంకరా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి