చిత్రం : సీతామాలక్ష్మి (1978)
సంగీతం : కే. వి. మహదేవన్M : మావి చిగురు తినగానే.. కోవిల పలికేనా
F : మావి చిగురు తినగానే.. కోవిల పలికేనా...
M : కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
F : కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
M : ఏమో ఏమనునో గాని ఆమని ఈ వని
F : మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా..
F : తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా తారాటలా సయ్యాటలా సయ్యాటలా తారాటలా
M : వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
F బింకాలు బిడియాలు పొంకాలు పోడములు
M : ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి గడసరి
F : మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా
M: ఒకరి ఒళ్ళు ఉయ్యాలా వేరొకరి గుండె జంపాల ఉయ్యాలా జంపాల జంపాల ఉయ్యాల
F: ఒకరి ఒళ్ళు ఉయ్యాలా వేరొకరి గుండె జంపాల
M : ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
F : పలకరింతలో పులకరింతలో
M : పలకరింతలో పులకరింతలో
F :ఏమో ఏమగునో గాని ఈ కథ మన కథ
M : మావి చిగురు తినగానే.. కోవిల పలికేనా
F: కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా
M:ఏమో ఏమనునో గాని ఆమని ఈ వని
F:మావి చిగురు తినగానే
కోవిల పలికేనా