22, మే 2022, ఆదివారం

Seetha Maalaxmi : Maavi Chiguru tinagaane song lyrics (మావి చిగురు తినగానే..)

చిత్రం : సీతామాలక్ష్మి (1978)

సంగీతం : కే. వి. మహదేవన్

సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల


M : మావి చిగురు తినగానే.. కోవిల పలికేనా

F : మావి చిగురు తినగానే.. కోవిల పలికేనా...

M : కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా

F : కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా

M : ఏమో ఏమనునో గాని ఆమని ఈ వని

F : మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా..

F : తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా తెమ్మెరతో తారాటలా     తుమ్మెదతో సయ్యాటలా     తారాటలా సయ్యాటలా     సయ్యాటలా తారాటలా

M : వన్నెలే కాదు వగలే కాదు      ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు      వన్నెలే కాదు వగలే కాదు     ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు

F బింకాలు బిడియాలు పొంకాలు పోడములు

M : ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి గడసరి

F : మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల పలికేనా

M: ఒకరి ఒళ్ళు ఉయ్యాలా     వేరొకరి గుండె జంపాల     ఉయ్యాలా జంపాల     జంపాల ఉయ్యాల

F: ఒకరి ఒళ్ళు ఉయ్యాలా     వేరొకరి గుండె జంపాల

M : ఒకరి పెదవి పగడాలో     వేరొకరి కనుల దివిటీలో     ఒకరి పెదవి పగడాలో     వేరొకరి కనుల దివిటీలో

F : పలకరింతలో పులకరింతలో

M : పలకరింతలో పులకరింతలో

F :ఏమో ఏమగునో గాని     ఈ కథ మన కథ

M : మావి చిగురు తినగానే.. కోవిల పలికేనా

F: కోవిల గొంతు వినగానే     మావి చిగురు తొడిగేనా

M:ఏమో ఏమనునో గాని     ఆమని ఈ వని

F:మావి చిగురు తినగానే     కోవిల పలికేనా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి