చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి(1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పల్లవి:
ఆ పాపి కొండల్లో
ఆఆఆఆఆఆ
ఈ పాప గుండెల్లో
ఒఒఒఒఒఒ
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో
ఎన్నో ఊసులు
గోరింక నవ్వుల్లో గోరింట పంటల్లో
ఎన్నో బాసలు
బులిపించే చలిలో మది మురిపించే గిలిలో
పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో
చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయిలాయిలో
ఆ పాపి కొండల్లో
ఆఆఆఆఆఆ
ఈ పాప గుండెల్లో
ఒఒఒఒఒఒ
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో
ఎన్నో ఊసులు
గోరింక నవ్వుల్లో గోరింట పంటల్లో
ఎన్నో బాసలు
బులిపించే చలిలో మది మురిపించే గిలిలో
పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో
చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయిలాయిలో
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో
ఎన్నో ఊసులు
చరణం:1
తడిగా ఒక పెదవి పొడిగా ఒక పెదవి
తడిగా పొడితడిగా తమకాన దాగితే
తడిగా ఒక తనువు మడిగా ఒక తనువు
తడిగా మడితడిగా తొలి హద్దు దాటితే
తెరిచేయనా ఆ తెరచాపని
విడదీయని ఓ విడిదీయనా
తపనలే తగలనీ లాయి లాల లాయి లాయిలో
ఒఒఒఒఒఒ
ఒఒఒఒఒఒ
ఆఆఆఆఆఆ
ఆ పాపి కొండల్లో ఈ పాప గుండెల్లో
ఎన్నో ఊసులు
చరణం:2
కొరికే కోరికలే కరిచే కౌగిలిలో
ఎదతో పై ఎదతో సయ్యాటలాడితే
కరిగే ప్రతి నిమిషం మరిగే పరవశమై
కదిపి నిను కుదిపి కేరింతలాడితే
కవ్వించనా కొంగు కొసరించనా
ఊరించకే ఊయలూగించకే
మనువులే కుదరనీ వెన్నెలమ్మ లాయి లాయిలో
ఒఒఒఒఒఒ
ఒఒఒఒఒఒ
ఆఆఆఆఆఆ
ఆ పాపి కొండల్లో
ఈ పాప గుండెల్లో ఎన్నో ఊసులు
బులిపించే చలిలో మది మురిపించే గిలిలో
పరువాల ఒడిలో ఆ సరసాల సడిలో
చలిగాలి కొట్టాల చెలరేగిపోవాల లాయి లాయిలో