చిత్రం: సీతారత్నం గారి అబ్బాయి(1992)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పల్లవి :
మేఘమా... మరువకే... మోహమా... విడువకే... మాఘమాస వేళలో మల్లెపూల మాలగా మరుని కూడి మెల్లగా మరలిరావే చల్లగా మదిలో మెదిలే మధువై...
చరణం : 1
నిదుర కాచిన కన్నె పానుపే రారా రమ్మంటుంటే కురులు విప్పిన అగరవొత్తులే అలకలు సాగిస్తుంటే సిగ్గే ఎరుగని రేయిలో తొలి హాయిలో అలివేణి రవికే తెలియని అందము అందించనా నెలరాజా కలలా... అలలా... మెరిసి.....
మేఘమా... మరువకే... మోహమా... విడువకే... మాఘమాస వేళలో మల్లెపూల మాలగా
చరణం : 2
గడుసు ఒడుపులే పరుపు విరుపులై గిచ్చే సందడిలోన తడవ తడవకి పెరుగుతున్నది ఏదో మైకం భామా మరుగే ఎరుగని కోనలో ఆ మోజులో మహరాజా నలిగే మల్లెల సవ్వడి వినిపించనా నెరజాణ జతగా... కలిసి... అలిసి...
మేఘమా... మరువకే... మోహమా... విడువకే... మాఘమాస వేళలో మల్లెపూల మాలగా మరుని కూడి మెల్లగా మరలిరావే చల్లగా మదిలో మెదిలే మధువై...
good song
రిప్లయితొలగించండి