Siri Siri Muvva లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Siri Siri Muvva లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, జనవరి 2024, సోమవారం

Siri Siri Muvva : Andaaniki Andam Song Lyrics (అందానికి అందం )

చిత్రం: సిరి సిరి మువ్వ (1976)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: కె. వి. మహదేవన్



పల్లవి: అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ చరణం:1 పలకమన్న పలకదీ పంచదార చిలక కులుకే సింగారమైన కోల సిగ్గుల మొలక పలకమన్న పలకదీ పంచదార చిలక కులుకే సింగారమైన కోల సిగ్గుల మొలక ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో నిదురించే పెదవిలో పదముంది పాడుకో పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ చరణం: 2 ఆ రాణి పాదాల పారాణి జిలుగులు నీ రాజ భోగాలు పాడనీ తెలుగులో ఆ రాణి పాదాల పారాణి జిలుగులు నీ రాజ భోగాలు పాడనీ తెలుగులో ముడి వేసిన కొంగునే గుడివుంది తెలుసుకో ముడి వేసిన కొంగునే గుడివుంది తెలుసుకో గుడిలోని దేవతని గుండెలో కలుసుకో పుత్తడి బొమ్మా పూచిన కొమ్మా అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ చరణం: 3 ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను ముందు జన్మ ఉంటే ఆ కాలి మువ్వనై పుడతాను పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ

26, ఫిబ్రవరి 2022, శనివారం

Siri Siri Muvva : Jhummandhi Nadam Song Lyrics (ఝుమ్మంది నాదం)

చిత్రం: సిరి సిరి మువ్వ (1976)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్



ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల ఎదలోని సొదలా ఎలదేటి రొదలా కదిలేటి నదిలా కలల వరదలా ఎదలోని సొదలా ఎలదేటి రొదలా కదిలేటి నదిలా కలల వరదలా చలిత లలిత పద కలిత కవితలెద సరిగమ పలికించగా స్వర మధురిమలొలికించగా సిరిసిరిమువ్వలు పులకించగా ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల నటరాజ ప్రేయసీ నటనాల ఊర్వశి నటియించు నీవని తెలిసి నటరాజ ప్రేయసీ నటనాల ఊర్వశి నటియించు నీవని తెలిసి ఆకాశమై పొంగె  ఆవేశం కైలాసమే ఒంగె  నీకోసం ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల మెరుపుంది నాలో అది నీ  మేని విరుపు ఉరుముంది నాలో అది నీ మువ్వ పిలుపు చినుకు చినుకులో చిందు లయలతో కురిసింది తొలకరి జల్లు విరిసింది అందాల హరివిల్లు ఈ పొంగులే ఏడు రంగులుగా ఝుమ్మంది నాదం సయ్యంది పాదం తనువూగింది ఈ వేళ చెలరేగింది ఒక రాసలీల