చిత్రం: సిరి సిరి మువ్వ (1976)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కె. వి. మహదేవన్
పల్లవి: అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ చరణం:1 పలకమన్న పలకదీ పంచదార చిలక కులుకే సింగారమైన కోల సిగ్గుల మొలక పలకమన్న పలకదీ పంచదార చిలక కులుకే సింగారమైన కోల సిగ్గుల మొలక ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో నిదురించే పెదవిలో పదముంది పాడుకో పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ చరణం: 2 ఆ రాణి పాదాల పారాణి జిలుగులు నీ రాజ భోగాలు పాడనీ తెలుగులో ఆ రాణి పాదాల పారాణి జిలుగులు నీ రాజ భోగాలు పాడనీ తెలుగులో ముడి వేసిన కొంగునే గుడివుంది తెలుసుకో ముడి వేసిన కొంగునే గుడివుంది తెలుసుకో గుడిలోని దేవతని గుండెలో కలుసుకో పుత్తడి బొమ్మా పూచిన కొమ్మా అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ చరణం: 3 ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను ముందు జన్మ ఉంటే ఆ కాలి మువ్వనై పుడతాను పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి