Sita Ramam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sita Ramam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, అక్టోబర్ 2022, ఆదివారం

Sita Ramam : Ninnati Theepi Song Lyrics (కన్నులు ముందు నీ కలలే )

చిత్రం : సీతా రామం (2022)

సంగీతం : విశాల్ చంద్రశేఖర్

సాహిత్యం : కృష్ణకాంత్

గానం: సునీత ఉపద్రష్ట

కన్నులు ముందు నీ కలలే ఎన్నడు పోవు నన్నొదిలి జన్మంతా దాచేస్తా నీతో నా కొంత కాలాన్ని గాలీ ధూళీ నీ పరిమళమే రోజూ జరిగే నీ పరిచయమే...... నిన్నటి తీపి జ్ఞాపకమే కన్నులు దాటి పోదసలే జన్మంతా దాచేస్తా నీతో నా కొంత కాలాన్ని నువ్విక రావు అని తెలిసి ప్రశ్నల వాన ఇక ముగిసి జన్మంతా దాచేస్తా నీతో నా కొంత కాలాన్ని

15, అక్టోబర్ 2022, శనివారం

Sita Ramam : Prapanchamantha Kore Ramude Nuvva song Lyrics (ప్రపంచమంత కోరే రాముడే నువ్వా)

చిత్రం : సీతా రామం (2022)

సంగీతం : విశాల్ చంద్రశేఖర్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: అనురాగ్ కులకర్ణి, సిందూరి ఎస్

ప్రపంచమంత కోరే రాముడే నువ్వా సీతేమో తోడు లేదుగా ఎవరిని అడగను ఏమయ్యిందని తెలుసుగా బదులు రాదని మనసుకి అలుసుగా ప్రాణం నువ్వని నమ్మదు తిరిగి రావని కాలం రాదు సాయమే మానదు ప్రేమ గాయమే అస్సలు కాదు న్యాయమే ముట్టడి చేసే దూరమే క్షమించలేని క్షణాలే ఇవ్వా.. ప్రపంచమంత కోరే రాముడే నువ్వా సీతేమో తోడు లేదుగా నరాలనే మెలేసే బాద నీదిగా కలైతే ఎంత బాగుర కంటికి కాన రాని కత్తెదూయలేని శత్రువుతోటి యుద్దమా ఉసురే తీస్తుంది రాం అన్న నీ పిలుపే ఉరిలా కోస్తోంది రావన్న ఓ తలపే క్షమించలేని క్షణాలే ఇవ్వా..

Sita Ramam : Kaanunna Kalyanam Song Lyrics (కానున్న కళ్యాణం ఏమన్నది )

చిత్రం : సీతా రామం (2022)

సంగీతం : విశాల్ చంద్రశేఖర్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: అనురాగ్ కులకర్ణి, సిందూరి ఎస్

కానున్న కళ్యాణం ఏమన్నది

స్వయంవరం మనోహరం

రానున్న వైభోగం ఎటువంటిది

ప్రతిక్షణం మరో వరం

విడువని ముడి ఇది కదా

ముగింపులేని గాధగా

తరముల పాటుగా

తరగని పాటగా

ప్రతి జత సాక్షిగా

ప్రణయము నేలగా సదా

కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా

కళ్ళముందు పారాడగా

కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా

కళ్ళముందు పారాడగా

చుట్టు ఎవరూ ఉండరుగా

కిట్టని చూపులుగా

చుట్టాలంటూ కొందరుండాలిగా

దిక్కులు ఉన్నవిగా

గట్టిమేలమంటూ ఉండగా

గుండెలోని సందడి చాలదా

పెళ్లి పెద్దలెవరు మనకి

మనసులే కదా

అవా సరే

కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా

కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా

తగు తరుణం ఇది కదా

మదికి తెలుసుగా

తదుపరి మరి ఏమిటటా

తమరి చొరవట

బిడియమిదేంటి కొత్తగా

తరుణికి తెగువ తగదుగా

పలకని పెదవి వెనక

పిలువు పోల్చుకో

సరే మరి

కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా

కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా

Sita Ramam : Inthandham Song Lyrics (ఇంతందం దారి మల్లిందా)

చిత్రం : సీతా రామం (2022)

సంగీతం : విశాల్ చంద్రశేఖర్

సాహిత్యం : కృష్ణకాంత్

గానం: యస్.పి.చరణ్

ఇంతందం దారి మల్లిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీ మహత్తు నీదేలే నీ నవ్వు తాకి  తరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరీ వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరీ నదిలా దూకేటి నీ పైట సహజగుణం పులిలా దాగుంది వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయేనా..! విల్లే ఎక్కుపెట్టి మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే యుద్ధం చాటింది నీపైన ఈ జగమే దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే

Sita Ramam : Oh Sita Hey Rama Song Lyrics (ఓ సీతా వదలనిక తోడౌతా )

చిత్రం : సీతా రామం (2022)

సంగీతం : విశాల్ చంద్రశేఖర్

సాహిత్యం : అనంత్ శ్రీరామ్

గానం: యస్.పి.చరణ్ & రమ్య బెహరా

ఓ సీతా వదలనిక తోడౌతా రోజంతా వెలుగులిడు నీడౌతా దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా హే రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా జంట జన్మనే గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులో ఉరుములో దాగుంది నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడౌతా హే రామా ఒకరికొకరౌతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులే నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరోవైపు లోకం ఏమి తోచని సమయంలో ఏది తేల్చని హృదయమో ఏమో బిడియమోనని నన్నాపే గొలుసు పేరేమో నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే ఎపుడు లేదే ఏదో వింత బాధే వంత పాడే క్షణం ఎదురాయే కలిసొస్తావా ఓ కాలమా కలలు కునుకులా కలుపుమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా.. ..

17, ఆగస్టు 2022, బుధవారం

Sita Ramam : Inthandham Song Lyrics (ఇంతందం దారి మల్లిందా)

చిత్రం: సీత రామం (2022)

రచన: కృష్ణకాంత్

గానం: యస్.పి.బీ.చరణ్

సంగీతం: విశాల్ చంద్రశేఖర్