Sitaara లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sitaara లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఏప్రిల్ 2022, శుక్రవారం

Sitara : Ku Ku Ku Song lyrics (కుకుకు కుకుకు)

చిత్రం: సితార (1984)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా  



కుకుకు కుకుకు కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే రాణి వాసము నీకు ఎందుకో... కో కో... రెక్క విప్పుకో చుక్కలందుకో... కో కో... కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే కుకుకు కుకు....... రంగుల లోకం పిలిచే వేళ.. రాగం నీలో పలికే వేళ విరుల తెరలే తెరచి రావే.. బిడియం విడిచి నడచి రావే నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో నా పాటల తోటకు రావే ఈ పల్లవి పల్లకిలో స్వరమై రావే విరిపొదల ఎదలకు కుకుకు కుకు కుకుకు కుకు కోకిల రావే సూర్యుడు నిన్నే చూడాలంట.. చంద్రుడు నీతో ఆడాలంట బురుజు బిరుదు విడిచి రావే.. గడప తలుపు దాటి రావే నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో నువ్వేలే రాజ్యం ఉంది ఆ నాలుగు దిక్కులలో లయగా రావే ప్రియ హృదయ జతులకు కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే కుకుకు (కుకు)కుకుకు (కుకు) కోకిల రావే రావేరాణి వాసము నీకు ఎందుకో.. కో...కో రెక్క విప్పుకో చుక్కలందుకో...కో.....కో కుకుకు కుకుకు కోకిల రావే...

13, జూన్ 2021, ఆదివారం

Sitara : Kinnerasani Vachindamma Song Lyrics (ఎండలకన్నే సోకని రాణి)

చిత్రం: సితార (1984)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్ పి శైలజ

సంగీతం: ఇళయరాజా  



పల్లవి: 

తననననన తననననన..  తననననన తననననన..  తననననన తననననన..తననననన  చమకు చమకు జింజిన జింజిన  చమకు చమకు జిన్న జిన్న జిన్న..  కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..  జమకు జమకు జింజిన జింజిన  జమకు జమకు జిన్న జిన్న జిన్న..  కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..  విశ్వనాధ కవితై..అది విరుల తేనె చినుకై..  కూనలమ్మ కులుకై..అది కూచిపూడి నడకై..  పచ్చని చేలా ...తనననన  పావడగట్టి..తనననన  పచ్చని చేలా పావడగట్టి  కొండమల్లెలే కొప్పునబెట్టీ  వచ్చే దొరసాని.. మా వన్నెల కిన్నెరసాని!!  కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..  కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..  చరణం:1  ఎండలకన్నే సోకని రాణి..  పల్లెకు రాణి పల్లవపాణి..  కోటను విడిచీ..పేటను విడిచీ..  కోటను విడిచీ..పేటను విడిచీ..  కన్నులా గంగా పొంగే వేళా..  నదిలా తానే సాగే వేళ..  రాగాల రాదారి పూదారి ఔతుంటే!!  ఆ రాగాల రాదారి పూదారి ఔతుంటే!!  కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..  కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..  చరణం:2  మాగాణమ్మా చీరలు నేసే..  మలిసందెమ్మ కుంకుమ పూసే..  మువ్వులబొమ్మా ముద్దులగుమ్మా  మువ్వులబొమ్మా ముద్దులగుమ్మా  గడప దాటి నడిచే వేళ..  అదుపే విడిచీ ఎగిరే వేళ..  వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే..  ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే!!  కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..  కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..  విశ్వనాధ కవితై..అది విరుల తేనె చినుకై..  కూనలమ్మ కులుకై..అది కూచిపూడి నడకై..  పచ్చని చేలా ...తనననన  పావడగట్టి..తనననన  పచ్చని చేలా పావడగట్టి  కొండమల్లెలే కొప్పునబెట్టీ  వచ్చే దొరసాని.. మా వన్నెల కిన్నెరసాని!!  వచ్చే దొరసాని.. మా వన్నెల కిన్నెరసాని!

Sitara : Jilibili Palukula song Lyrics (జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన)

చిత్రం: సితార (1984)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా  




జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా అడగను లే చిరునామా ఓ మైనా ఓ మైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా తారలకే సిగపువ్వా తారాడే సిరి మువ్వ తారలకే సిగపువ్వా తారాడే సిరి మువ్వ హరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైనా జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా ఎండలకే అల్లాడే వెన్నెలలో త్రినీడ ఎండలకే అల్లాడే వెన్నెలలో త్రినీడ వినువీధి నీడల్లో రాగంలా ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఏమైనా జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తొలకరి వయసుల మినుగురి సొగసుల ఈ మైనా మైనా మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార గుడికే చెరని దీపం పదమటి సంధ్యరాగం మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా చుక్కలు అందక ధిక్కుల దాగిన నేనెలే ఆ మైనా జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తొలకరి వయసుల మినుగురి సొగసుల ఈ మైనా మైనా