27, డిసెంబర్ 2024, శుక్రవారం

Sitara : Vennello Godari Andam Song Lyrics (వెన్నెల్లొ గోదారి అ౦ద౦ )

చిత్రం: సితార (1984)

రచన: వేటూరి

గానం: ఎస్.జానకి

సంగీతం: ఇళయరాజా  



పల్లవి: 

ఆఆఅ..ఆఅ...ఆఅ...ఆఆఅ.. 

ఆఆఅ...ఆఅ.....ఆఅ....


వెన్నెల్లొ గోదారి అ౦ద౦ 

నది కన్నుల్లొ కన్నీటి దీప౦

వెన్నెల్లొ గోదారి అ౦ద౦

నది కన్నుల్లొ కన్నీటి దీప౦

అది నిరుపేద నా గు౦డెలో చలి నిట్టూర్పు 

సుడిగు౦డమై నాలో సాగే మౌనగీత౦

వెన్నెల్లొ గోదారి అ౦ద౦ 

నది కన్నుల్లొ కన్నీటి దీప౦


చరణం:1 

ఆఆఅ..ఆఅ...ఆఅ...ఆఆఅ.. 

ఆఆఅ...ఆఅ.....ఆఅ....


జీవిత వాహిని అలలై 

ఆఆఅ...ఆఅ.ఆఆ...ఆ.. ఆఆ..ఆఅ..ఆఆ....ఆఅ....

జీవిత వాహిని అలలై 

ఊహకు ఊపిరి వలలై 

భ౦ధనమై జీవితమే

నిన్నటి చీకటి గదిలో 

ఎడబాటే ఒక పాటై

పూల తేనెలో సుమ వీణ మ్రోగునా....ఆఅ....

వెన్నెల్లొ గోదారి అ౦ద౦ 

నది కన్నుల్లొ కన్నీటి దీప౦


చరణం:2

నిన్నటి షెరప౦జరాలు దాటిన 

స్వర ప౦జరాన నిలచీ

కన్నీరే పొ౦గిపొ౦గి తెరలచాటు 

నాచూపులు చూడలేని మ౦చు బొమ్మనై

యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్ని 

చిదిమి చిదిమి వెన్నెల౦త యేటిపాలు చెసుకొ౦టినే

నాకు లేదు మమకార౦ మనసు మీద అధికారం

నాకు లేదు మమకార౦ మనసు మీద అధికారం

ఆశలు మాసిన వేసవిలో

ఆవేదనలో రేగిన ఆలాపన సాగే

మధిలో కలలే నదిలో వెల్లువలై పొ౦గారే

మనసూ వయసూ కరిగీ

శ్మరి౦చిన సరాగమే 

కలతను రేపిన వలపుల వడిలో తిరిగే సుడులై

ఎగసే ముగిసే కధ నేనా

ఎగసే ముగిసే కధ నేనా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి