Sneham Kosam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sneham Kosam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జులై 2021, గురువారం

Sneham Kosam : Meesamunna Nesthama Song Lyrics (మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ)

చిత్రం:స్నేహం కోసం(1999)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రాజేష్



మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ

రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ

కోపమెక్కువ కానీ మనసు మక్కువ

స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా

ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడ

మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ

రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ



ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కధలు

మర్రిచెట్టు చెబుతుంది పంచుకొని తిన్నచద్ది రుచులు

చెఱకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు

టెంటు హాలు చెబుతుంది ఎన్.టి.ఆర్. స్టంటు బొమ్మ కధలు

పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ

ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి

వయసంత మరచి కేరింతలాడె ఆ తీపి జ్ణాపకాలు

కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి

మనలాగే అవికూడా విడిపోలేనంటాయి


మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ

రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ



ఒక్కతల్లి సంతానమైన మనలాగ వుండగలరా

ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైన నమ్మగలరా

నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్నతండ్రినైనా

ప్రేమ పంచిన తీరులోన నే నిన్ను మించగలనా

ఏ పుణ్యం చేసానో నే నీ స్నేహం పొందాను

నా ప్రాణం నీదైనా నీ చెలిమి ఋణం తీరేనా

నీకు సేవ చేసేందుకైనా మరుజన్మ కోరుకోనా

స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా

ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడా


మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ

రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ

కోపమెక్కువ కానీ మనసు మక్కువ

స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా

ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నినువీడ


Sneham Kosam : Voohallao Voopirilo Song Lyrics (ఊహలలో ఊపిరిలో ఉన్నది నీవేలే)

చిత్రం:స్నేహం కోసం(1999)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: భువనచంద్ర

గానం: బాలసుబ్రహ్మణ్యం, సుజాత



ఊహలలో ఊపిరిలో ఉన్నది నీవేలే

నా మనసూ నా వయసూ అన్నీ నీకేలే

నన్ను గెలిచినా సుందరివే

మనసు దోచినా మంజరివే

అణువు అణువునా నీవేలే

అంతరాత్మలో నీవేలే

కొండా కోనా ఎండా వానా అన్నీ మనవేలే


భూగోలపు అంచుల వెంటా తిరిగే వద్దాం

ఏడేడు సందారైనా దాటే వద్దాం

గగనంలో గోలలన్ని గాలించేద్దాం

మన ప్రేమల జండా ఒక్కటి నాటే వద్దాం

ఆ నింగీ ఈ నేలా మన స్వేచ్చ కేమొ ఎల్లలూ

హరి విల్లు చిరు జల్లు మన ప్రేమ కేమొ సాక్షులూ

చంద్రుడెరుగని పున్నమి రాత్రులు ప్రేమలోనె ఉన్నాయిలే


ఊహలలో ఊపిరిలో ఉన్నది నీవేలే

ఊసులలో బాసలలో ఉన్నది నీవేలే


ప్రేమస్త్రం సందిస్తేనె తిరుగే లేదూ

అణ్వస్త్రాలెన్నున్నా చెల్లా చెదురూ

లోకంలో శాస్వతమైనది ప్రేమేనంటా

ఆ ప్రేమకి కావలసినదీ మనసేనంటా

ఆ నాడు ఈ నాడు గెలిచేది ప్రేమ ఒక్కటే

ఎవరన్నా ఏమన్నా నిలిచేది ప్రేమ ఒక్కటె

కాలమెరుగని గాదలు ఎన్నో ప్రేమలోనే ఉన్నాయిలే


ఊహలలో ఊపిరిలో ఉన్నది నీవేలే

నా మనసూ నా వయసూ అన్నీ నీకేలే

నన్ను గెలిచినా సుందరివే

మనసు దోచినా మంజరివే

అణువు అణువునా నీవేలే

అంతరాత్మలో నీవేలే

కొండా కోనా ఎండా వానా అన్నీ మనవేలే

Sneham Kosam : Kaikaluri Kanne Pilla Song Lyrics (కైకలూరి కన్నే పిల్లా)

చిత్రం:స్నేహం కోసం(1999)

సంగీతం: S.A.రాజ్ కుమార్

సాహిత్యం: వేటూరి

గానం: ఉదిత్ నారాయణ్, కవిత కృష్ణమూర్తి



కైకలూరి కన్నే పిల్లా కోరుకుంటే రానామల్లా

గుమ్మా ముద్దూ గుమ్మా గుండే నీదేనమ్మా

కోరుకున్నా కుర్రవాడా కోరివచ్చా సందకాడ

యమ్మో యమ్మో యమ్మో బుగ్గా కందేనమ్మో

సల్లకొచ్చినమ్మ ఇక లొల్లి పెట్టకమ్మ

కోరింది ఇచ్చి పుచ్చుకోవె గుంతలకడి గుమ్మా


కైకలూరి కన్నే పిల్లా కోరుకుంటే రానామల్లా హా


వలపే పెదాలలో పదాలు పాడే కదిలే నరాలలో సరాలు మీటే

ఓ తనువే తహా తహా తపించిపోయే కనువే నిషాలతో కావాలి పాడే

సు సు సుందరి పూల పందిరి

పో పో పోకిరి చాలిక అల్లరి

నీ ఈడు తాకకమ్మ నేనెట్ట వేగనమ్మ

నీ వంటి గుట్టు బయటపెట్టి బెట్టుచేయకమ్మా

కోరుకున్నా కుర్రవాడా కోరివచ్చా సందకాడ


మనసే అరేబియా ఎడారి ఎండై నడుమే నైజీరియా నాట్యము చేసే

హే మల్లెపూల వలే మంచే కురిపిస్తా పారే చలయేటిలో స్నానం చేయిస్తా

రా రా సుందరా నీకే విందురా

జా జా జాతరా ఉంది ముందరా

ధీటైన పోటుగాడా చాటుంది టోటకాడ

నా వంటి గుట్టు తేనెపట్టు యమా యమా యమ్మా


కైకలూరి కన్నే పిల్లా కోరుకుంటే రానామల్లా

యమ్మో యమ్మో యమ్మో బుగ్గా కందేనమ్మో

సల్లకొచ్చినమ్మ ఇక లొల్లి పెట్టకమ్మ

కోరింది ఇచ్చి పుచ్చుకోవె గుంతలకడి గుమ్మా


కైకలూరి కన్నే పిల్లా కోరుకుంటే రానామల్లా

గుమ్మా ముద్దూ గుమ్మా బుగ్గా కందేనమ్మో