Snehamante Idera లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Snehamante Idera లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, డిసెంబర్ 2023, శనివారం

Snehamante Idera : Chelia Nee Premalone Song Lyrics ( చెలియా నీ ప్రేమలోనే)

చిత్రం: స్నేహమంటే ఇదేరా (2001)

రచన: మృత్యంజయుడు

గానం: హరిహరన్, సుజాత

సంగీతం: శివ శంకర్




చెలియా నీ ప్రేమలోనే పరవశించి పోయానే చెలియా నీ ప్రేమలోనే పరవశించి పోయానే పెదవి మీది సిగ్గులన్ని పైట చాటు దాచకే ముద్దు కొరి చెంతకోస్తే సిగ్గులెందుకే నీ నవ్వే సింగారమో నీ పలుకే బంగారమో నీ ముద్దో మందారమో రోజా రారా రారా ప్రియుడా నీ ప్రేమలోనే పులకరించి పోయానే

మాటలన్నీ మాయ చేసి ప్రేమకు వల వేసా ప్రేమ మైకం పొంగిన వేళ మౌనం సాధించా కన్నులు నాలుగు కలిసిన వేళ భాషకు చోటేది మౌనం పాడే అలాపానకు మించినదెముందీ మాటలే మనసుకు బరువైతే మౌనమే కానుక అవుతుంది మౌనం అను భాషే రాకుంటే ప్రేమ ఇక వ్యర్థం అవుతుంది నీ ప్రేమ భావనే నిజం నిజం ఏదో చెప్పాలని ఉంది గుండె ఝల్లుమంది సిగ్గును చెందని పూవును తుమ్మెద అంటదులే ముద్దును పొందని సిగ్గులో బుగ్గలు కందవులే చెలియా నీ ప్రేమలోనే పరవశించి పోయానే Music Music ప్రేమ కానుక పొందిన వేళ సర్వం మరిచాను నా ప్రేమకు నిత్యం ప్రాణం పోసి కవినైపోయాను తియ్యగా పలికిన స్వరముల ఝల్లున మనసే తడిసింది నీకై నిలిచి నిన్నే తలచి ప్రాణం ఇస్తుంది యవ్వనం వయసుకు తోడైతే ఆశలకు పండుగా అవుతుంది శ్వాసలో స్వర్గం కనుగొంటే జీవితం మధురసమవుతుంది ఇక ఉరించకే ప్రియ ప్రియ నీ అంద చందాలన్నీ చూసి కళ్లు చెదిరే మదిలో దాగిన ఊహలో ఊపిరి నీవైతివి వద్దని కన్నులు మూసిన ఎదుటే నీవుంటివి చెలియా నీ ప్రేమలోనే పరవశించి పోయానే ప్రియుడా నీ ప్రేమలోనే పులకరించి పోయానే పెదవి మీది సిగ్గులన్ని పైట చాటు దాచకే ముద్దు కొరి చెంతకోస్తే సిగ్గులెందుకే నీ నవ్వే సింగారమో నీ పలుకే బంగారమో నీ ముద్దో మందారమో రోజా రారా రారా చెలియా నీ ప్రేమలోనే పరవశించి పోయానే

Snehamante Idera : Naa Pedaviki Song Lyrics (నా పెదవికి నవ్వులు నేర్పావు)

చిత్రం: స్నేహమంటే ఇదేరా (2001)

రచన: చిర్రావూరి విజయ్ కుమార్

గానం: రాజేష్, సుజాత

సంగీతం: శివ శంకర్



నా పెదవికి నవ్వులు నేర్పావు ప్రియా నీకు జోహారు నా కనులకు కళలే చూపావే చెలీ చెంతకే చేరు ఎదే ఉండిపో నా మదిలో నిండిపో సుధవై సఖివై మన కలయిక కథలుగ సాగాలి మన కథ ఒక చరితగ వెలగాలి నా పెదవికి నవ్వులు నేర్పావు ప్రియా నీకు జోహారు ఏ దేవిగా బంధమై అల్లుకుంది ఈ దేవినే అందుకో కానుకంది నువ్వు పక్కనుంటె ఎండే చల్లగున్నది నువ్వు ముట్టుకుంటె ముళ్ళే మల్లెలైనవి నువ్వు నా ప్రాణమై నీ ప్రేమతో నడిపించవా నా పెదవికి నవ్వులు నేర్పావు ప్రియా నీకు జోహారు నా నుదిటిపై కుంకుమై నిలిచిపోవా మా ఇంటికే దీపమై నడిచి రావా వేల ఊహాలందు నిన్నే దాచుకుంటిని కోటి ఆశలందు నిన్నే చూసుకొంటిని నువ్వు నా చూపువై నా ఊపిరై ప్రేమించవా నా పెదవికి నవ్వులు నేర్పావు ప్రియా నీకు జోహారు నా కనులకు కళలే చూపావే చెలీ చెంతకే చేరు ఎదే ఉండిపో నా మదిలో నిండిపో సుధవై సఖివై మన కలయిక కథలుగ సాగాలి మన కథ ఒక చరితగ వెలగాలి