Sri Krishnarjuna Yuddhamu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sri Krishnarjuna Yuddhamu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జనవరి 2022, శుక్రవారం

Sri Krishnarjuna Yuddham : Manasu Parimalinchene Song Lyrics (మనసు పరిమళించెనే)

చిత్రం: శ్రీ కృష్ణార్జున యుద్ధం(1962)

సాహిత్యం: పింగళి

గానం: ఘంటసాల, యస్ వరలక్ష్మి

సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు



మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే నవవసంత గానముతో..నీవు నటనసేయగనే మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే నవవసంత రాగముతో..నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే *నీకు నాకు స్వాగతమనగా..కోయిలమ్మ కూయగా గలగలగల సెలయేరులలో..కలకలములు రేగగా మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే నవవసంత రాగముతో..నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే *క్రొత్తపూల నెత్తావులతో.. మత్తుగాలి వీచగా (2) భ్రమరమ్ములు గుములు గుములుగా ఝుంఝుమ్మని పాడగా మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే *తెలిమబ్బులు కొండకొనలపై హంసలవలె ఆడగా (2) రంగరంగ వైభవములతో ప్రకృతి విందుచేయగా మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే నవవసంత రాగముతో..నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే

17, జనవరి 2022, సోమవారం

Sri Krishnarjuna Yuddhamu : Veyi Subhamulu Kalugu Neeku Song Lyrics (వేయి శుభములు కలుగు)

చిత్రం: శ్రీ కృష్ణార్జున యుద్ధం(1962)

సాహిత్యం: పింగళి

గానం: యస్ వరలక్ష్మి

సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు



వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే... వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా.... వాసుదేవుని చెల్లెలా... నీ ఆశయే ఫలియించెలే... వాసుదేవుని చెల్లెలా... నీ ఆశయే ఫలియించెలే... దేవదేవుల గెలువజాలిన బావయే పతి ఆయెలే... వేయి శుభములు కలుగు నీకు... పోయి రావే మరదలా భరతవంశము నేలవలసిన వీరపత్నివి నీవెలే భరతవంశము నేలవలసిన వీరపత్నివి నీవెలే వీరధీరకుమారమణితో మరల వత్తువుగానిలే... వేయి శుభములు కలుగు నీకు... పోయి రావే మరదలా ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే... వేయి శుభములు కలుగు నీకు... పోయి రావే మరదలా....