21, జనవరి 2022, శుక్రవారం

Sri Krishnarjuna Yuddham : Manasu Parimalinchene Song Lyrics (మనసు పరిమళించెనే)

చిత్రం: శ్రీ కృష్ణార్జున యుద్ధం(1962)

సాహిత్యం: పింగళి

గానం: ఘంటసాల, యస్ వరలక్ష్మి

సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు



మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే నవవసంత గానముతో..నీవు నటనసేయగనే మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే నవవసంత రాగముతో..నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే *నీకు నాకు స్వాగతమనగా..కోయిలమ్మ కూయగా గలగలగల సెలయేరులలో..కలకలములు రేగగా మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే నవవసంత రాగముతో..నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే *క్రొత్తపూల నెత్తావులతో.. మత్తుగాలి వీచగా (2) భ్రమరమ్ములు గుములు గుములుగా ఝుంఝుమ్మని పాడగా మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే *తెలిమబ్బులు కొండకొనలపై హంసలవలె ఆడగా (2) రంగరంగ వైభవములతో ప్రకృతి విందుచేయగా మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే నవవసంత రాగముతో..నీవు చెంత నిలువగనే మనసు పరిమళించెనే..తనువు పరవశించెనే

1 కామెంట్‌: