చిత్రం: శ్రీనివాస కళ్యాణం (1987)
రచన: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: కె. వి. మహదేవన్
ఎందాక ఎగిరేవమ్మా ..ఆ.. ఆ.. గోరింక .. గోరింక
సందే వాలినాక గూటికి చేరుకోక
సందే వాలినాక గూటికి చేరుకోక
ఎందాక ఎగిరేవమ్మా .. ఆ.. ఆ.. గోరింక .. గోరింక
జోడుగువ్వ వాకిలి కాసే.. నీడలెక్కి చీటకి మూసే
పెందరాలే ఇంటికి చేరు.. పెత్తనాలు చాలునింకా
ఎందాక .. ఎందాక.. ఎగిరేవమ్మా ..
ఆ.. ఆ.. గోరింక.. అహ.. గోరింక
చరణం 1:
రాసకార్యమంటూ నువ్వూ దేశమేలబోతే
వేగుచుక్క వెక్కిరింతలో కునుకైనా రాదే
మూసుకున్న రెప్పల వెనకే చూసుకోవే నన్ను
పిల్లగాలి గుస గుస నేనై జోల పాడుతానూ
ఎందుకులే దోబూచాట తొందరగా రావేమంట
కోరగానే తీరిపోతే కోరిక విలువేమిటంట
ఎందాక .. ఎందాక.. ఎగిరేవమ్మా ..
ఆ.. ఆ.. గోరింక.. అహ.. గోరింక
సందే వాలినాక గూటికి చేరుకోక
ఎందాక ఎగిరేవమ్మా ..
ఆ.. ఆ.. గోరింక .. గోరింక
చరణం 2:
ఊసుబోని ఏకాంతంలో తోసిపోకు నన్ను
తోడులేని కలల బరువుతో ఈడునీదలేను
దారం నీ చేతిని ఉన్నా గాలిపఠం నేను
దూరం ఎంతైనా కానీ నిన్ను వీడిపోను
తీసుకుపో నీతో బాటే.. కాదంటే నామీదొట్టే
తీసుకుపో నీతో బాటే.. కాదంటే నామీదొట్టే
ఊరించే దూరం ఉంటే అదో కమ్మదనమేనంట
ఎందాక ..ఎందాక ఎగిరేవమ్మా ..
ఆ.. ఆ.. గోరింక అహ.. గోరింక
సందే వాలినాక గూటికి చేరుకోక
ఎందాక ఎగిరేవమ్మా ..
ఆ.. ఆ.. గోరింక .. అహ.. గోరింక..