చిత్రం: శ్రీనివాస కళ్యాణం (1987)
రచన: వేటూరి సుందరరామ మూర్తి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,యస్. జానకి
సంగీతం: కె. వి. మహదేవన్
పల్లవి :
ఆ ఆ ఆ అహ హ హ ఆ
తొలిపొద్దుల్లో హిందోళం మలిపొద్దుల్లో భుపాళం
తొలిపొద్దుల్లో హిందోళం మలిపొద్దుల్లో భుపాళం
నేనుగ మారిన నీకోసం నీదైపోయిన నా ప్రాణం
నీకే అంకితం నీవే జీవితం
నీకే అంకితం నీవే జీవితం
తొలిపొద్దుల్లో హిందోళం మలిపొద్దుల్లో భుపాళం
చరణం 1 :
పచ్చని దేవత పలికే చోట... కుంకుమ పువ్వులు చిలికే చోట
తెల్లని మబ్బులు కురిసే చోట.... ఆ.. ఆ... లోకపు హద్దులు ముగిసే చోట
రెండో చెవిని పడకుండా.. మాట ఇచ్చుకుంటా
మూడో కంట పడకుండా.. ముద్దు ఇచ్చుకుంటా
రెండో చెవిని పడకుండా ... మాట ఇచ్చుకుంటా
మూడో కంట పడకుండా.. ముద్దు ఇచ్చుకుంటా
నేనుగ మారిన నీకోసం నీదైపోయిన నా ప్రాణం
నీకే అంకితం నీవే జీవితం
తొలిపొద్దుల్లో హిందోళం... మలిపొద్దుల్లో భుపాళం
చరణం 2 :
కాలం కదలక నిలిచే చోట... కడలే అలలను మరిచే చోట
రాతిరి ఎండలు కాచే చోట.. ఆ.. ఆ.. ప్రేమలు కన్నులు తెరిచే చోట
ఆమని కోయిల వినకుండా.. పాటలల్లుకుంటా
వెన్నెల పువ్వుల పొదరింట .. నిన్ను అల్లుకుంటా
ఆమని కోయిల వినకుండా.. పాటలల్లుకుంటా
వెన్నెల పువ్వుల పొదరింట.. నిన్ను అల్లుకుంటా
నేనుగ మారిన నీకోసం.. నీదైపోయిన నా ప్రాణం
నీకే అంకితం.. నీవే జీవితం
తొలిపొద్దుల్లో హిందోళం.. మలిపొద్దుల్లో భుపాళం
తొలిపొద్దుల్లో హిందోళం.. మలిపొద్దుల్లో భుపాళం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి