Subhakankshalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Subhakankshalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, జులై 2021, మంగళవారం

Subhakankshalu : Ananda Ananda Maye (Male) (ఆనందమానందమాయే)

చిత్రం: శుభాకాంక్షలు (1998)

సంగీతం: కోటి

సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ

గానం: బాలసుబ్రహ్మణ్యం


ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే

ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే

మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే

కాలమే పూలదారి సాగనీ...

గానమే గాలిలాగ తాకనీ...

ఈ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని


ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే

మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే


చరణం 1:


నువ్వు నడచు దారుల్లో పూలు పరచి నిలుచున్నా

అడుగు పడితె గుండెల్లో కొత్త సడిని వింటున్నా


నీలి కళ్ళ ముంగిట్లో నన్ను నేను కనుగొన్నా

నిండు గుండె గుమ్మంలో తోరణంగ నేనున్నా

నీవైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే

నీ మాటే పలికే స్వరమే నీతోనే కలిసే వరమే

వేణువంటి నా హృదయంలో ఊపిరి పాటై పాడగా


ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే

మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే


చరణం 2:


రాగమాల రమ్మంటూ స్వాగతాలు పలికింది

ఆగలేని వేగంలో ఆశ అడుగు వేసింది


జతగ నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది

రెప్పచాటు లోకంలో కలల కోన కదిలింది

మనసంతా హాయిని మోసి నీకోసం ప్రేమను దాచి

రాగాలే రాశులు పోసి ఈ గీతం కానుక చేసి

శుభాకాంక్షలే పలకాలి నవ్వుల పువ్వుల మాలతో


ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే

మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే

మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే

కాలమే పూలదారి సాగనీ...

గానమే గాలిలాగ తాకనీ...

ఈ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని


ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే

మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయే


Subhakankshalu : Ananda Ananda Maye Song Lyrics (ఆనందమానందమాయే)

చిత్రం: శుభాకాంక్షలు (1998)

సంగీతం: కోటి

సాహిత్యం: సామవేదం షణ్ముఖశర్మ

గానం: చిత్ర


ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే

మాటలు చాలని హాయే ఒక పాతగ మారిన మాయే

కాలమే పూలదారి సాగనీ

గానమే గాలిలాగ తాకనీ

నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినది


చరణం


నూవునడచు దారుల్లో పూలు పరచి నిలుచున్నా

అడుగు పడితే గుండెల్లో కొత్త సడిని వింటున్నా

నీలికళ్ళ ముంగిట్లో నన్ను నేను కనుగొన్నా

నిండు గుండె గుమ్మంలో తోరణంగా నేనున్నా

నీవైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే

నీ మాటే పలికే స్వరమే నీతోనే కలిసే వరమే

వేణువంటి నా హృదయంలో ఊపిరిపాటై పాడగా

ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే

మాటలు చాలని హాయే ఒక పాతగ మారిన మాయే


చరణం


రాగబాల రమ్మంటూ స్వాగతాలు పలికింది

ఆగలేని వేగంలో ఆశ అడుగు వేసింది

జతగా నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది

రెప్పచాటు లోకంలో కలల కోన కదిలింది

మనసంతా హాయిని మోసి నీ కోసం ప్రేమను దాచి

రాగాలే రాశులు పోసి ఈ గీతం కానుక చేసి

శుభాకంక్షలే పలకాలి నవ్వుల పువ్వుల మాలతో 

30, జూన్ 2021, బుధవారం

Subhakankshalu : Manasa Palakave Song Lyrics (మనసా పలకవే మధుమాసపు కోయిలవై)

చిత్రం: శుభాకాంక్షలు (1998)

సంగీతం: కోటి

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర


మనసా పలకవే మధుమాసపు కోయిలవై  చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై  మంచుతెరలే తెరుచుకుని మంచి తరుణం తెలుసుకుని  నవ్వులే పువ్వులై విరియగా  తుమ్మెద తుమ్మెద విన్నావమ్మా నిన్ను ఝుమ్మంటు రమ్మంది రంగేళి పూవమ్మా  మనసా పలకవే మధుమాసపు కోయిలవై  చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై  నాలో కులుకుల కునుకును రేపి  లోలో తెలియని తలపులు రేపి  పిలిచే వలపుల వెలుగును చూపి లాగే రాగమిది  నీలో మమతల మధువుని చూసి  నాలో తరగని తహతహ దూకి  నీకై గలగల పరుగులు తీసి చేరే వేగమిది  ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా  ఎడేడు జన్మాల బంధాలతో ఈ నాడు నీ ఈడు పండించనా  మరి తయ్యారయ్యే ఉన్నా వయ్యారంగా సయ్యంటు ఒళ్ళోకి వాలంగా  దూసుకొచ్చానమ్మా చూడు ఉత్సాహంగా చిన్నారి వన్నెల్ని ఏలంగా  ప్రతిక్షణం పరవశం కలగగా  మనసా పలకవే మధుమాసపు కోయిలవై  చెలిమే తెలుపవే చిగురాశల గీతికవై  ఆడే మెరుపుల మెలికల జానా  పాడే జిలిబిలి పలుకుల మైనా  రాలే తొలకరి చినుకులలోనా తుళ్ళే తిల్లానా  వేగే పదముల తపనలపైనా  వాలే చినుకుల చెమటల వానా  మీటే చిలిపిగ నరముల వీణ తియ్యని తాళానా  బంగారు శృంగార భావాలతో పొగారు ప్రాయాన్ని కీర్తించనా  అందాల మందారహారాలతో నీ గుండె రాజ్యాన్ని పాలించనా  ఇక వెయ్యేళ్ళైనా నిన్ను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా  ఇక వెళ్ళాలన్నా ఇంక వీల్లేదంటూ స్నేహాల సంకెళ్ళు కట్టేయనా  కాలమే కదలక నిలువగా

19, జూన్ 2021, శనివారం

Subhakankshalu : Addanki Cheerakatti Song Lyrics (అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ)

 చిత్రం: శుభాకాంక్షలు (1998)

సంగీతం: కోటి

సాహిత్యం: శన్ముఖ శర్మ

గానం: బాలు, చిత్ర



అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా సై అంటూ సైటుకొట్టే సత్యబామ చూసుకోమా కాచుకోమ్మ ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా తరిమే ఉరిమే మామ తగువుకు దిగుదామా.. దా ఆ అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా సై అంటూ సైటుకొట్టే సత్యబామ చూసుకోమా కాచుకోమ్మ ఊరు పేరు చెప్పకుండా హటాత్తుగా దిగొచ్చేనే మారుమాటలాడకుండా వరించుకో నీ దాననే దొరికితే వదలనిదానా ఉరకకు మరి ఇక పైన తరిమితే తడబడి పోదా మరిమరి ముడి పడి పోనా గజబిజి కథలను గడుసుగ నడిపిన తగవుల మగువకు తెగువలు ముదిరెను రో అరె అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా సై అంటూ సైటుకొట్టే సత్యబామ చూసుకోమా కాచుకోమ్మ బ్రహ్మచారి బాధలన్నీ పోవాలని వచ్చానిలా బ్రహ్మ రాతలేమోగాని భలే ముడి పడిందిలా బుసలిక చాలునులేరా చెలి గుసగుస వినుకోరా విసురులు విసరకే జాన కోసవరకిది నడిచేనా పెదవుల పదవిని వదలని తపనకి మగ సెగ తగిలితే మగతలు కలిగెనురో హా అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా హోయ్ సై అంటూ సైటు కొట్టే సత్యబామ చూసుకోమా కాచుకోమ్మ ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా తరిమే ఉరిమే మామ తగువుకు దిగుదామా ఆ ఆ

Subhakankshalu : Gunde Ninda Gudigantalu Song Lyrics (గుండె నిండా గుడి గంటలు)

చిత్రం:శుభాకాంక్షలు(1997)

సంగీతం: కోటి , S.A.రాజ్ కుమార్

గానం: బాలసుబ్రహ్మణ్యం ,రేణుక

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి



గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మ్రోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ...... గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఎన్నో మ్రోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే చరణం:1 చూస్తూనే మనసు వెళ్ళి నీ ఒళ్ళో వాలగా నిలువెల్ల మారిపోయా నేనే నీ నీడగా నిలవదు నిమిషం నువ్వు ఎదురుంటే కదలదు సమయం కనబడకుంటే నువ్వొస్తూనే ఇంద్రజాలం చేశావమ్మా కవ్విస్తూనే చంద్రజాలం వేశావమ్మా పరిచయమే చేశావే నన్నే నాకు కొత్తగా ఓ ప్రేమ ................. గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే చరణం:2 నీ పేరే పలవరించే నాలో నీ ఆశలు మౌనాన్నే ఆశ్రయించే ఎన్నెన్నో ఊసులు తెరిచిన కనులే కలలకు నెలవై కదలని పెదవే కవితలు చదివే ఏన్నెన్నెన్నో గాథలున్న నీ భాషని ఉన్నట్టుండి నేర్పినావే ఈ రోజుని నీ జతలో క్షణమైనా బ్రతుకును చరితగా మార్చేస్తుందమ్మా గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు ఏన్నో మ్రోగుతుంటే కళ్ళ నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలంటే వెంటనే పోల్చాను నీ చిరునామా ప్రేమ.........................