చిత్రం: సుఖదుఃఖాలు (1968)
రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గాయని: పి.సుశీల
సంగీతం: యస్.పి.కోదండపాణి
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమని
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది
కసిరే ఎండలు కాల్చునని ముసిరే వానలు ముంచునని
ఇక కసిరే ఎండలు కాల్చునని మరి ముసిరే వానలు ముంచునని
ఎరుగని కోయిల ఎగిరింది చిరిగిన రెక్కల ఒరిగింది నేలకు ఒరిగింది
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమని
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది
మరిగిపోయేది మానవ హృదయం కరుణ కలిగేది చల్లని దైవం
వాడే లతకు ఎదురైవచ్చు వాడని వసంతమాసం వసివాడని కుసుమ విలాసం
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమని
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది
ద్వారానికి తారామణి హారం హారతి వెన్నెల కర్పూరం
మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచెనీమందారం
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమని
తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది