చిత్రం: సుఖ దుఃఖాలు (1967) సంగీతం: యస్.పి.కోదండపాణి సాహిత్యం: దేవులపల్లి. కృష్ణశాస్త్రి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది ..పొదరిల్లు మాది నేనైతే ఆకూకొమ్మా తానైతే వెన్నెల వెల్ల పదిలంగా నేసిన పూసిన పొదరిల్లూ మాది ..పొదరిల్లు మాది కోవెల్లో వెలిగే దీపం దేవీ మా తల్లీ కోవెల్లో తిరిగే పాటలగువ్వా నా చెల్లీ
గువ్వంటే గువ్వా కాదు గొరవంకా గాని
వంకంటే వంకా కాదు నెలవంకా గాని
మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది ..పొదరిల్లు మాది
గోరొంకా పెళ్ళైపోతే ఏ వంకో వెళ్ళీపోతే
గూడంతా గుబులై పోదా? గుండెల్లో దిగులై పోదా?
మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది ..పొదరిల్లు మాది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి