Swapna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Swapna లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, ఏప్రిల్ 2022, శుక్రవారం

Swapna : Ide Naa Modati Prema Lekha Song Lyrics (ఇదే నా మొదటి ప్రేమ లేఖ )

చిత్రం: స్వప్న (1980)

సాహిత్యం: రాజశ్రీ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: సత్యం



ఇదే నా మొదటి ప్రేమ లేఖ

రాశాను నీకు చెప్పలేక

ఎదుటపడి మనసు తెలుపలేక

తెలుపుటకు భాష చేతకాక

తెలుపుటకు భాష చేతకాక

ఇదే నా మొదటి ప్రేమ లేఖ

రాశాను నీకు చెప్పలేక

ఎదుటపడి మనసు తెలుపలేక

తెలుపుటకు భాష చేతకాక

తెలుపుటకు భాష చేతకాక

మెరుపని పిలవాలంటే

ఆ వెలుగు ఒక్క క్షణం

పువ్వని పిలవాలంటే

ఆ సొగసు ఒక్క దినం

ఏ  రీతిగా నిన్ను

పిలవాలో తెలియదు నాకు...

ఏ  రీతిగా నిన్ను

పిలవాలో తెలియదు నాకు... తెలిసింది ఒక్కటే

నువ్వు నా ప్రాణమని

ప్రేమ .. ప్రేమ .... ప్రేమ

ఇదే నా మొదటి ప్రేమ లేఖ

రాశాను నీకు చెప్పలేక

ఎదుటపడి మనసు తెలుపలేక

తెలుపుటకు భాష చేతకాక

తెలుపుటకు భాష చేతకాక

తారవని  అందామంటే

నింగిలో మెరిసేవు

ముత్యమని  అందామంటే

నీటిలో వేలిసేవు

యదలోన కదిలే నిన్ను

దేనితో సరి పోల్చాలో...

యదలోన కదిలే నిన్ను

దేనితో సరి పోల్చాలో...

తెలిసింది ఒక్కటే

నువ్వు నా ప్రాణమని

ప్రేమ | ప్రేమ | ప్రేమ  

ఇదే నా మొదటి ప్రేమ లేఖ

రాశాను నీకు చెప్పలేక

ఎదుటపడి మనసు తెలుపలేక

తెలుపుటకు భాష చేతకాక

తెలుపుటకు భాష చేతకాక

2, ఫిబ్రవరి 2022, బుధవారం

Swapna : Ankitham Neeke Ankitham Song Lyrics (అంకితం నీకే అంకితం)

చిత్రం: స్వప్న (1980)

సాహిత్యం: దాసరి నారాయణ రావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: సత్యం



అంకితం నీకే అంకితం....అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా ఆ ఆ ఆ ఓ ప్రియా ఓ ప్రియా కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్ధ సార నవత నవ వసంత శోభనా మయూఖ లలిత లలిత రాగ చంద్రరేఖ స్వరము స్వరమూ కలయికలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది స్వరమూ స్వరమూ కలయికలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది ఆ అనురాగం ఒక ఆలయమైతే ఆ ఆలయ దేవత నీవైతే ఆ ఆలయ దేవత నీవైతే గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం అంకితం నీకే అంకితం లోక వినుత జయదేవ శ్లోక శృంగార రాగదీప భరత శాస్త్ర రమణీయ నాద నవ హావ భావ రూప స్వర విలాస హాస చతుర నయన సుమ వికాస బాస సుందర వదన నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమా ప్రేమా కలయికతో ఒక ప్రణయం పుడుతుంది నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమా ప్రేమా కలయికతో ఒక ప్రణయం పుడుతుంది ఆ ప్రణయం ఒక గోపురమైతే ఆ గోపుర కలశం నీవైతే ఆ గోపుర కలశం నీవైతే పుష్పం పత్రం ధూపం దీపం సర్వం అంకితం అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా ఆ ఆ ఆ ....ఓ ప్రియా ఓ ప్రియా