చిత్రం: ఠాగూర్(2003)
రచన: వేటూరి
గానం : మల్లికార్జున్, మహా లక్ష్మి
సంగీతం: మణి శర్మ
పల్లవి:
(F) మన్మధా మన్మధా మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా.. (M) తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా… జన్మకీ గుమ్మతో జంట కట్టరా (F) మన్మధా మన్మధా మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా (M) తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా… జన్మకీ గుమ్మతో జంట కట్టరా (F) అబ్బనీ తియ్యనీ వలపంతా ఇచ్చుకో మనసారా.. (M) ఏ, జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా (F) హే, మన్మధా మన్మధా మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా (M) తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా… జన్మకీ గుమ్మతో జంట కట్టరా చరణం 1 (M) ఎంత దాహం ఓ మన్మధా… ఎంగిలైనా తేనే కదా.. (F) పూల వయసు ఓ తుమ్మెదా… కాటు పడ్డా తీపే కదా (M) వాలేదా ఇలా మీదా… సఖీ రాధా రారాదా.. (F) దా దా దా.. దయే రాదా… ప్రియం కాదా నా మీదా... (M) ముక్కు పచ్చ ఈడు గిచ్చే ముద్దులిచ్చేదా.. (F) హేహెహె… సిగ్గు వచ్చి మొగ్గ విచ్చే బుగ్గలిచ్చేదా హే, మన్మధా హ్ మన్మధా హ్ మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరా (M) తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా… జన్మకీ గుమ్మతో జంట కట్టరా చరణం 2 (F) ఆకలేసి సోకులన్నీ… సొమ్మసిల్లీ పోతయ్ కదా.. (M) సోకులన్నీ చిలకా చుట్టి… నోటికిస్తే ముద్దే కదా (F) రాగాల సరాగాల ఇదే గోలా ఈ వేళా (M) ఊగాలా వయ్యారాలు వసంతాలే ఆడేలా (F) చాటు మాటు చూసి నీకు చోటు పెట్టేదా (M) ఓ ఓ… మాట వరసే మార్చి నీకు మనసు ఇచ్చేదా (F) హే హే హే, మన్మధా మన్మధా మామ పుత్రుడా… ఇంద్రుడే చంద్రుడై కన్ను కొట్టెరాఆ.. (M) తుమ్మెదా తుమ్మెదా తీపి కుట్టుడా… జన్మకీ గుమ్మతో జంట కట్టరా (F) అబ్బనీ తియ్యనీ వలపంతా ఇచ్చుకో మనసారాఆఆ.. (M) జాంగిరీ పొంగులా జగదాంబా ఇచ్చుకో సొగసారా