చిత్రం: త్యాగయ్య (1981)
సాహిత్యం: త్యాగరాజస్వామి
సంగీతం: కె.వి.మహదేవన్
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: ఆరభి
తాళం: ఆది
సాధించెనే ఓ మనసా
సమయానికి తగు మాటలాడెనే
ప ...ప మ గ రి రి ...మ గ రి రి
స సా స స ద ప ... స స స రి మ
దేవకీ వసుదేవుల నేగించినటు
సమయానికి తగు మాటలాడెనే
ప ప మ గ రీ - రీ మ గ - రి రి స స |
ద ద , స - సా , రి రీ , స రి మ
రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు
సమయానికి తగు మాటలాడెనే
ద దా - ప ద - ప ప, దప మ - మా ప – మ | గ రి రీ రీ మ మ పా పా సా రి మ
గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు
సమయానికి తగు మాటలాడెనే
ద ప మ ప ద సా- ద ద ప పా మ గ రి- రి | , స– సా సా– ద ద పా – మ గ రి రి సా ||
సా – స ద , ప– మ ప ద సా స ద రీ రి | స రి - దా స- పా ద మా ప– మ గ రి - రి మ ||
వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే
పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు
ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి
సమయానికి తగు మాటలాడెనే
పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి
కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ
సమయానికి తగు మాటలాడెనే
సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ కొనెనే
అలుగ వద్దననే విముఖులతో జేర బోకుమనెనే
వెత గలిగిన తాళుకొమ్మననే దమశమాది సుఖ దాయకుడగు
శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే
సాధించెనే ఓ మనసా సాధించెనే
బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు
సాధించెనే ఓ మనసా