చిత్రం:వాగ్దానం (1961)
రచన: దాశరధి
గానం: ఘంటసాల,పి. సుశీల
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
.ఉ...ఉ... నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా... నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా ఆ..ఆ..ఆ..ఆ... ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో జాబిలి వెలిగేను మనకోసమే... అహ..హా..ఆ.. ఈ నాటి పున్నమి ఏ నాటి పున్నెమో జాబిలి వెలిగేను మనకోసమే... నెయ్యాలలో తలపుటుయ్యాలలో... నెయ్యాలలో తలపుటుయ్యాలలో అందుకొంద్దాము అందని ఆకాశమే... నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా... ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా అహ..హా..ఆ.. ఆ చందమామలో ఆనంద సీమలో వెన్నెల స్నానాలు చేయుదమా మేఘాలలో వలపు రాగాలలో... మేఘాలలో వలపు రాగాలలో.... దూర దూరాల స్వర్గాల చేరుదమా.... నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా... ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా అహ..హా..ఆ.. ఈ పూలదారులూ ఆ నీలి తారలు తీయని స్వప్నాల తేలించగా అందాలనూ తీపి బంధాలను... అందాలనూ తీపి బంధాలను... అల్లుకుంద్దాము డెందాలు పాలించగా... నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా... ఆ..ఆ..ఆ..ఆ.ఆ..ఆ..ఆ నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా.