చిత్రం:వాగ్దానం (1961)
రచన: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల,పి. సుశీల
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
పల్లవి:
పాహి రామప్రభో వరదా శుభదా పాహి దీన పాలా ఆ.... వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా రామా... వెలుగు చూపవయ్యా ఆ....
చరణం 1:
మాహాత్ములైనా దురాత్ములైనా మనుజులపేరనే మసలేరయ్యా మాహాత్ములైనా దురాత్ములైనా మనుజులపేరనే మసలేరయ్యా అందరికీ నీ అభయం కలదని అనుకోమందువ దేవా... ఆ... అనుకోమందువ దేవా ఆ... వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా..
చరణం 2:
ఆ...ఆ...ఆ... నేరక చేసిన కారణమున మా నేరము నేరము కాకపోవునా నేరక చేసిన కారణమున మా నేరము నేరము కాకపోవునా కన్నీరే ఆ కలుషమునంతా కడిగివేయునా రామా...ఆ... కడిగివేయునా రామా...ఆ.. వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా...
చరణం 3:
ఆ...ఆ...ఆ... కలరూపేదో కలవో లేవో ఆ...ఆ...ఆ.. కలరూపేదో కలవో లేవో ఎద ఉన్నది ఈ వేదనకేనో ఏది అన్నెమో ఏది పున్నెమో ఎరుగలేము శ్రీరామా...ఆ.. ఎరుగలేము శ్రీరామా...ఆ..ఆ.. వెలుగు చూపవయ్యా మదిలో కలత బాపవయ్యా..
Thanks for posting the lyrics. I couldn't understand the last couple of lines myself.
రిప్లయితొలగించండిAlthough I wish you didn't add English marks to the lyrics, but it is what it is...