Veerabhimanyu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Veerabhimanyu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఫిబ్రవరి 2022, శనివారం

Veerabhimanyu : Ramba Urvasi Taladanne Song Lyrics (రంభా ఊర్వశి )

చిత్రం: వీరాభిమన్యు (1965)

సాహిత్యం: ఆరుద్ర

సంగీతం: కె వి మహదేవన్

గానం: ఘంటసాల, పి. సుశీల


రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె ఇంద్రుని చంద్రుని అందాలు ఇతని సొమ్మే కాబోలు రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె నన్నే వెదకుచు భూమికి దిగిన కన్యక రతియే కాబోలు ఇంద్రుని చంద్రుని అందాలు ఇతని సొమ్మే కాబోలు మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా పరవశించీ పడుచువానికి వధువు కాని సొగసేలా పరవశించీ పడుచువానికి వధువు కాని సొగసేలా రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు కలికి సరసన పులకరించే కరగి పోవని తనువేలా కలికి సరసన పులకరించే కరగి పోవని తనువేలా ఎడము లేక ఎదలు రెండూ ఏకమవని బ్రతుకేలా ఎడము లేక ఎదలు రెండూ ఏకమవని బ్రతుకేలా రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు 

కన్యక రతియే కాబోలు మన్మధుడితడే కాబోలు 

Veerabhimanyu : Chuchi Valachi Song Lyrics (చూచి వలచి చెంతకు పిలచి)

చిత్రం: వీరాభిమన్యు (1965)

సాహిత్యం: ఆరుద్ర

సంగీతం: కె వి మహదేవన్

గానం: ఘంటసాల, పి. సుశీల



పల్లవి: చూచి వలచి చెంతకు పిలచి నీ సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి చూచీ వలచీ చెంతకు చేరీ నా సొగసులు కానుక జేసి నీ మగసిరి బానిసనైతీ చూచీ వలచీ చెంతకు చేరీ సొగసులు కానుక జేసి నీ మగసిరి బానిసనైతీ చరణం 1: అందాలన్నీ దోచీ ఆనందపుటంచులు చూచి అందాలన్నీ దోచీ ఆనందపుటంచులు చూచి సందిట బంది చేసీ... సందిట బంది చేసీ నా బందీ వశమైపోతి చరణం 2: నూతన వధువై నిలచీ వరుణి వలపుల మధువై మారి నూతన వధువై నిలచీ వరుణి వలపుల మధువై మారి సఖునీ ఒడిలో సురిగీ.. సఖునీ ఒడిలో సురిగీ కోటి సుఖముల శిఖరమునైతీ చరణం 3: వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగమూ మరచీ... వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగమూ మరచీ నీవే జగమై... నీలో సగమై.. నేటికి నిండుగ పండితి

Veerabhimanyu : Adigo Navalokam Song Lyrics (అదిగో .... నవలోకం)

చిత్రం: వీరాభిమన్యు (1965)

సాహిత్యం: ఆరుద్ర

సంగీతం: కె వి మహదేవన్

గానం: ఘంటసాల, పి. సుశీల



ఆ ఆ ఆ ఆ ....ఆ ఆ ఆ ఆ .... ఆ ఆ ఆ ఆ అదిగో .... నవలోకం వెలసే ....మనకోసం అహహహ ఆహహ ఒహోహోహో ఒహోహో ఊహూహూహూ ఊహూహూ అదిగో .. నవలోకం... వెలసే ... మనకోసం అదిగో .. నవలోకం... వెలసే ... మనకోసం నీలి ..నీలి ..మేఘాల లీనమై ప్రియా .. నీవు నేను తొలి ప్రేమకు ప్రాణమై నీలి ..నీలి ..మేఘాల లీనమై ప్రియా .. నీవు నేను తొలి ప్రేమకు ప్రాణమై దూర ..దూర .. తీరాలకు సాగుదాం.. సాగి దోర వలపు సీ .మలో.. ఆగుదాం దూర ..దూర .. తీరాలకు సాగుదాం.. సాగి దోర వలపు సీ .మలో.. ఆగుదాం ఎచట సుఖముందో.. ఎచట సుధ గలదో అచట మనముందామా ..ఆ ..ఆ.. అదిగో .. నవలోకం... వెలసే ... మనకోసం పారిజాత సుమదళాల పానుపూ మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ పారిజాత సుమదళాల పానుపూ మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ ఫలించే కోటి మురిపాలు ముద్దులూ మన ప్రణయానికి లేవు సుమా హద్దులూ ఫలించే కోటి మురిపాలు ముద్దులూ మన ప్రణయానికి లేవు సుమా హద్దులూ ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో అచట మనముందామా ..ఆ..ఆ..ఆ.ఆ. అదిగో .. నవలోకం... వెలసే ... మనకోసం అదిగో .. నవలోకం... వెలసే ... మనకోసం