12, ఫిబ్రవరి 2022, శనివారం

Veerabhimanyu : Ramba Urvasi Taladanne Song Lyrics (రంభా ఊర్వశి )

చిత్రం: వీరాభిమన్యు (1965)

సాహిత్యం: ఆరుద్ర

సంగీతం: కె వి మహదేవన్

గానం: ఘంటసాల, పి. సుశీల


రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె ఇంద్రుని చంద్రుని అందాలు ఇతని సొమ్మే కాబోలు రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె నన్నే వెదకుచు భూమికి దిగిన కన్యక రతియే కాబోలు ఇంద్రుని చంద్రుని అందాలు ఇతని సొమ్మే కాబోలు మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా పరవశించీ పడుచువానికి వధువు కాని సొగసేలా పరవశించీ పడుచువానికి వధువు కాని సొగసేలా రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు కలికి సరసన పులకరించే కరగి పోవని తనువేలా కలికి సరసన పులకరించే కరగి పోవని తనువేలా ఎడము లేక ఎదలు రెండూ ఏకమవని బ్రతుకేలా ఎడము లేక ఎదలు రెండూ ఏకమవని బ్రతుకేలా రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు 

కన్యక రతియే కాబోలు మన్మధుడితడే కాబోలు 

2 కామెంట్‌లు: