Velugu Needalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Velugu Needalu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఫిబ్రవరి 2022, మంగళవారం

Velugu Needalu : Siva Govinda Govinda Song Lyrics (శివ గోవింద గోవింద)

చిత్రం: వెలుగు నీడలు (1961)

సాహిత్యం: కొసరాజు

గానం: మాధవపెద్ది సత్యం & ఉడుత సరోజినీ

సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు



శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద సంతానమే లేక స్యర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు సంతానమే లేక స్యర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు సంతు కలిగిందంటే చిట్టి పాపాయి గతి శ్రీమతే రామానుజాయా నమహ శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద తమ బాగు కోసమై తంటాలు పడలేరు ఎదుటి కొంపకి ఎసరు పెడతారయా పొరుగు పచ్చకి ఓర్వలేని వారి గతి శ్రీమతే రామానుజాయా నమహా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద పరుల కోసం త్వాగమొనరించు వారొకరు పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు పరుల కోసం త్వాగమొనరించు వారొకరు పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు ఉపకారికే కీడు తలపెట్టు వారి గతి శ్రీ మద్రరమరమణగోవిందో హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద కలిమి లేనన్నాళ్లు కలిసిమెలిసుంటారు కలిమి చేరిననాడు టాటాలు చెబుతారు కలిమి పెంచే కాయ కష్టజీవుల పని శ్రీమతే రామానుజాయా నమహా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద ఆనాడు శ్రీ యోగి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం భోద చేశారయా ఆనాడు శ్రీ యోగి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం భోద చేశారయా ఈనాడు కొసకవి వెంగళ్లప్ప మాట అక్షరాల జరిగి తీరేనయా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద



Velugu Needalu : Paadavoyi Bhaaratheeyudaa Song Lyrics (పాడవోయి భారతీయుడా)

చిత్రం: వెలుగు నీడలు (1961)

సాహిత్యం: శ్రీ శ్రీ

గానం: ఘంటసాల, ,పి. సుశీల

సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు




పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ పాడవోయి భారతీయుడా నేడె స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం నేడె స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం నేడె నవోదయం నీదే ఆనందం ఓ.. పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా .. పాడవోయి భారతీయుడా ఓ ఓ ఓ ఓ స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ సంబర పడగానే సరిపోదోయి స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ సంబర పడగానే సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని పొందీ అదె విజయమనుకుంటె పొరపాటోయి ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారులా ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారులా ఆ ఆ ఆగకోయి భారతీయుడా ఆకాశం అందుకొనే ధరలొక వైపు అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు ఆకాశం అందుకొనే ధరలొక వైపు అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు అవినీతి బంధుప్రీతి చీకటి బజారూ అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ కాంచవోయి నేటి దుస్థితి పదవీ వ్యామోహాలు కులమత భేధాలు భాషా ద్వేషాలు చెలరేగె నేడు పదవీ వ్యామోహాలు కులమత భేధాలు భాషా ద్వేషాలు చెలరేగె నేడు ప్రతి మనిషి మరియొకని దోచుకొనె వాడే ఏ ఏ ప్రతి మనిషి మరియొకని దోచుకొనె వాడే తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనె వాడే స్వార్ధమీ అనర్ధకారణం అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్ స్వార్ధమీ అనర్ధకారణం అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్ స్వార్ధమీ అనర్ధకారణం సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం నీ లక్ష్యం సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం



28, జనవరి 2022, శుక్రవారం

Velugu Needalu : kalakaanidi Viluvainadi Song Lyrics (కల కానిది...విలువైనది)

చిత్రం: వెలుగు నీడలు (1961)

సాహిత్యం: శ్రీ శ్రీ

గానం: ఘంటసాల 

సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు



కల కానిది...విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు కల కానిది...విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా

గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా జాలి వీడి అటులే దాని వదలివైతువా..ఓ..ఓ.. చేరదీసి నీరుపోసి చిగురించనీయవా కల కానిది...విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు అలముకున్న చీకటిలోనే అలమటించనేల కలతలకే లొంగిపోయి కలువరించనేల..ఓ..ఓ.. సాహసమను జ్యోతిని చేకొని సాగిపో కల కానిది...విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు అగాథమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏదీ తనంత తానై నీ దరికిరాదు శోధించి సాధించాలి అదియే ధీరగుణం కల కానిది...విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు బ్రతుకు...బలిచేయకు !!