చిత్రం: వెలుగు నీడలు (1961)
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
కల కానిది...విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు కల కానిది...విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా
గాలివీచి పూవులతీగ నేలవాలిపోగా జాలి వీడి అటులే దాని వదలివైతువా..ఓ..ఓ.. చేరదీసి నీరుపోసి చిగురించనీయవా కల కానిది...విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు అలముకున్న చీకటిలోనే అలమటించనేల కలతలకే లొంగిపోయి కలువరించనేల..ఓ..ఓ.. సాహసమను జ్యోతిని చేకొని సాగిపో కల కానిది...విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు అగాథమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏదీ తనంత తానై నీ దరికిరాదు శోధించి సాధించాలి అదియే ధీరగుణం కల కానిది...విలువైనది బ్రతుకు కన్నీటిధారలలోనే బలిచేయకు బ్రతుకు...బలిచేయకు !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి