6, అక్టోబర్ 2012, శనివారం

Mahatma : Em Jarugutundi Em Jarugutundi Song(ఎం జరుగుతుంది జరుగుతుంది నా మనసుకివ్వాల)

చిత్రం : మహాత్మా(2001)

గానం: కార్తీక్, సంగీత

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

సంగీతం : విజయ్ ఆంటోనీ



పల్లవి:

ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా ! ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !! హే నీ ఎదట నిలిచే వరకూ .. ఆపదట తరిమే పరుగూ ఏ పనట తమతో తనకూ .. తెలుసా హో! నీ వెనక తిరిగే కనులూ .. చూడవట వేరే కలలూ ఏ మాయ చేసావసలూ .. సొగసా !! ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా ! ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !! చరణం 1:
పరాకులో పడిపోతుంటే .. కన్నె వయసు కంగారూ అరే అరే అంటూ వచ్చీ తోడు నిలబడూ పొత్తిళ్ళల్లో పసిపాపల్లే .. పాతికేళ్ళ మగ ఈడూ ఎక్కెకెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడూ ఆకాసమే ఆపలేనీ చినుకు మాదిరీ .. నీకోసమే దూకుతోందీ చిలిపి లాహిరీ ఆవేశమే ఓపలేని వేడీ ఊపిరీ .. నీతో సావసమే కోరుతోంది ఆదుకోమరీ ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా ! ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !! చరణం 2:
ఉండుండిలా ఉబికొస్తుందేం కమ్మనైన కన్నీరు తీయనైన గుబులిది అంటే నమ్మేదెవ్వరూ మధురమైన కబురందిందే కలత పడకు బంగారూ పెదివితోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరూ గంగలాగ పొంగి రానా ప్రేమ సంద్రమా నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా ! ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !! హే నీ ఎదట నిలిచే వరకూ .. ఆపదట తరిమే పరుగూ ఏ మాయ చేసావసలూ .. సొగసా ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా ! ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి