30, మే 2021, ఆదివారం

Abhilasha - Banti Chamanti Song Lyrics (బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే)

చిత్రం: అభిలాష(1983 )

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్. జానకి

సంగీతం: ఇళయ రాజా



పల్లవి :

బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే

చరణం : 1

తేనె వాగుల్లో మల్లె పూలల్లే తేలిపోదాములే గాలీవానల్లో మబ్బు జంటల్లే రేగిపోదాములే విసిరే కొసచూపే ముసురై పోతుంటే ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే వేడెక్కి గుండెల్లో తలదాచుకో తాపాలలో ఉన్న తడి ఆర్చుకో ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే

చరణం : 2

తారత్తా తరతత్ తరతా తారత్తా తరతత్ తరరా పూతపెదవుల్లో పుట్టు గోరింట బొట్టు పెట్టిందిలే ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే ఒదిగే మనసేదో ఒకటై పొమ్మంటే ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే కాలాలు కరిగించు కౌగిళ్ళలో దీపాలు వెలిగించు నీ కళ్ళతో ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి