Abhilasha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Abhilasha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, డిసెంబర్ 2024, గురువారం

Abhilasha : Vela paala ledu song lyrics (వేళాపాళాలేదు కుర్రాళ్ళాటకు )

చిత్రం: అభిలాష(1983 )

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్. జానకి

సంగీతం: ఇళయ రాజా



పల్లవి :

తారా..రం రం వేళాపాళాలేదు కుర్రాళ్ళాటకు ఓడేమాటలేదు ఆడేవాళ్ళకు ఏది గెలుపో హొయ్ హొయ్ ఏది మలుపో హొయ్ హొయ్ తెలియవరకు ఇదే ఇదే ఆట మనకు తకధిమితథొంత తకధిమితథొంత తకధిమితథొంత తరికిటతరికిటథా

చరణం : 1

మన్మధుడు నీకు మంత్రి అనుకొకు నీ వయసు కాచేందుకు వయసు ఒక చాకు అది వాడుకోకు నా మనసు కోసేందుకు మనసే లెడు నీకు ఇచ్చెసావు నాకు లేదనీ నీదని కలగని నిజమని అనుకొని ఆడకు .. లా లా లా లా లా లా లా లా తకధిమితథొంత తకధిమితథొంత తకధిమితథొంత తరికిటతరికిటథా

చరణం : 2

కలలకొక రూపు కనులకొక కైపు తొలిమాపు విరిపానుపు కవితలిక ఆపు కలుసుకొ రేపు చెబుతాను తుది తీరుపు అహ ఏ తీర్పు వద్దు ఇదిగొ తీపి ముద్దు వద్దని ముద్దని చిదుమని పదమని చిటికెలు వేయకు వేళాపాళాలేదు కుర్రాళ్ళాటకు ఓడేమాటలేదు ఆడేవాళ్ళకు ఏది గెలుపో హొయ్ హొయ్ ఏది మలుపో హొయ్ హొయ్ తెలియవరకు ఇదే ఇదే ఆట మనకు తకధిమితథొంత తకధిమితథొంత తకధిమితథొంత తరికిటతరికిటథా

31, జులై 2021, శనివారం

Abhilasha : Sandhe Poddula Kaada Song Lyrics (సందెపొద్దుల కాడ)

చిత్రం: అభిలాష(1983 )

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్. జానకి

సంగీతం: ఇళయ రాజా



పల్లవి :

సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమౌతుందో ఎవరికిస్తుందో ఏమౌతుందో సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది అందగాడికి తోడు చలిగాలి రమ్మంది ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

చరణం : 1

కొండాకోన జలకాలాడే వేళ కొమ్మరెమ్మ చీర కట్టే వేళ పిందె పండై చిలక కొట్టే వేళ పిల్ల పాప నిదరే పోయే వేళ కలలో కౌగిల్లే కన్నులు దాటాల ఎదలే పొదిరిల్లై వాకిలి తియ్యాల ఎదటే తుమ్మెద పాట పువ్వుల బాట వెయ్యాల సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది ఎల్లువయ్యే ఈడు ఏడెక్కీపోయే వాడు ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో

చరణం : 2

మల్లె జాజి మత్తు చల్లే వేళ పిల్లా గాలి జోల పాడే వేళ వానే వాగై వరదై పొంగే వేళ నేనే నీవై వలపై సాగే వేళ కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల పుట్టిన ఎన్నెల్లో పుట్టకళ్ళు తాగాల పగలే ఎన్నెల గుమ్మా చీకటి గువ్వాలాడాల సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది అందగాడికి తోడు చలిగాలి రమ్మంది మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమౌతుందో ఎవరికిస్తుందో ఏమౌతుందో సందెపొద్దుల కాడ సంపంగి నవ్వింది అందగాడికి తోడు చలిగాలి రమ్మంది

Abhilasha : Navvindi Malle Chendu Song Lyrics (నవ్వింది మల్లెచెండు)

చిత్రం: అభిలాష(1983 )

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్. జానకి

సంగీతం: ఇళయ రాజా



పల్లవి :

యురేకా.... తార తాతార తతారత్తా....(2) నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్ ఫ్రెండు దొరికెరా మజాగ చాన్సు జరుపుకో భలే రొమాన్సు యురేకా సకమిక...నీ ముద్దు తీరేదాకా నవ్వింది మల్లెచెండు నచ్చింది గర్ల్ ఫ్రెండు యురేకా....

చరణం : 1

లవ్వు సిగ్నల్ నాకివ్వగానే నవ్వుకున్నాయ్ నా యవ్వనాలే ఆ నవ్వుతోనే కదిలెయ్యగానే నాటుకున్నాయ్ నవనందనాలే అహ చూపుల్లో నీ రూపం కనురెప్పల్లో నీ ప్రాణం కన్నుకొట్టి కమ్ముకుంట కాలమంత అమ్ముకుంట రపప్ప రపప్ప రపప్ప రపప్ప కన్నె ఈడు జున్నులన్నీ జుర్రుకుంటా(నవ్వింది)

చరణం : 2

కస్సుమన్న ఓ కన్నెపిల్ల ఎస్సు అంటే ఒక కౌగిలింత కిస్సులిచి నే కౌగిలిస్తే అరె తీరిపోయే నాకున్న చింత నేను పుట్టిందే నీకోసం ఈ జన్మంతా నీ ధ్యానం ముద్దుపెట్టి మొక్కుకుంట మూడుముళ్ళు వేసుకుంట సబబ్బా రిబబ్బా సబబ్బా సబరిబరబ... ఏడు జన్మలేలుకుంట నేను జంటగా(నవ్వింది)

30, మే 2021, ఆదివారం

Abhilasha - Banti Chamanti Song Lyrics (బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే)

చిత్రం: అభిలాష(1983 )

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్. జానకి

సంగీతం: ఇళయ రాజా



పల్లవి :

బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే

చరణం : 1

తేనె వాగుల్లో మల్లె పూలల్లే తేలిపోదాములే గాలీవానల్లో మబ్బు జంటల్లే రేగిపోదాములే విసిరే కొసచూపే ముసురై పోతుంటే ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే వేడెక్కి గుండెల్లో తలదాచుకో తాపాలలో ఉన్న తడి ఆర్చుకో ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే

చరణం : 2

తారత్తా తరతత్ తరతా తారత్తా తరతత్ తరరా పూతపెదవుల్లో పుట్టు గోరింట బొట్టు పెట్టిందిలే ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే ఒదిగే మనసేదో ఒకటై పొమ్మంటే ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే కాలాలు కరిగించు కౌగిళ్ళలో దీపాలు వెలిగించు నీ కళ్ళతో ఆ మాట వింటే కరిగే నా ప్రాణమంతా నీ సొంతమేలే బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే మల్లి మందారం పెళ్ళాడుకున్నాయిలే నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే

Abhilasha Songs - Urakalai Godavari - (ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి)

చిత్రం: అభిలాష(1983 )

రచన: ఆచార్య ఆత్రేయ

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్. జానకి

సంగీతం: ఇళయ రాజా



పల్లవి :

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి రసమయం జగతి ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి

చరణం : 1

నీ ప్రణయ భావం నా జీవరాగం నీ ప్రణయ భావం నా జీవరాగం రాగాలు తెలిపే భావాలు నిజమైనవి లోకాలు మురిసే స్నేహాలు ఋజువైనవి అనురాగ రాగాల స్వరలోకమే మనదైనది ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి రసమయం జగతి

చరణం : 2

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం నా పేద హృదయం నీ ప్రేమ నిలయం నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది నీవన్న మనిషే ఈనాడు నాదైనది ఒక గుండె అభిలాష పదిమందికీ బ్రతుకైనది ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి జత వెతుకు హృదయానికి శృతి తెలిపె మురళి చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళి రసమయం జగతి