చిత్రం: ఛాలెంజ్(1984)
సంగీతం: ఇళయరాజా
రచన: వేటూరి సుందరరామ మూర్తి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
పల్లవి:
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే..
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే
ఐ లవ్ యూ ఓ హారికా.. నీ ప్రేమకే జోహారికా
ఐ లవ్ యూ ఓ హారికా..నీ ప్రేమకే జోహారికా.. ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే..
చరణం : 1
కవ్వించే కన్నులలో కాటేసే కలలెన్నో
పకపక నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో..
కసి కసి చూపులతో కొస కొస మెరుపులతో నన్నల్లుకో..
ముకిళించే పెదవుల్లో మురిపాలు ఋతువుల్లో మధువంతా సగపాలు..
సాహోరే భామా..హోయ్
పకపక నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో..
కసి కసి చూపులతో కొస కొస మెరుపులతో నన్నల్లుకో..
ముకిళించే పెదవుల్లో మురిపాలు ఋతువుల్లో మధువంతా సగపాలు..
సాహోరే భామా..హోయ్
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే..
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే
ఐ లవ్ యూ ఓ హారికా.. నీ ప్రేమకే జోహారికా
ఐ లవ్ యూ ఓ హారికా..నీ ప్రేమకే జోహారికా
చరణం : 2
మీసంలో మిసమిసలు, మోసాలే చేస్తుంటే..
బిగిసిన కౌగిలిలో సొగసరి మీగడలే దోచేసుకో..
రుస రుస వయసులతో ఎడదల దరువులతో ముద్దాడుకో
తొలిపుట్టే ఎండల్లో సరసాలు..
పగపట్టే పరువంలో ప్రణయాలు.. జోహారే... భామా..హోయ్
ఇందువదన కుందరదన మందగమన మధురవచన
గగన జఘన సొగసు లలనవే..
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే
ఐ లవ్ యూ ఓ హారికా..నీ ప్రేమకే జోహారికా ఐ లవ్ యూ ఓ హారికా.. నీ ప్రేమకే జోహారికా ఇందువదన కుందరదన మందగమన మధురవచన

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి