చిత్రం: ఛాలెంజ్(1984)
రచన: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
సంగీతం: ఇళయరాజా
భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా.. మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా వద్దంటే వయసొచ్చి వద్దన్నా మనసిచ్చి నిద్దరకే సెలవిచ్చేయ్ ఈ వేళా.. భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా.. తప్పంటూ చేయక పోతే తగలాటము.. నిప్పంటి వయసులతోనా చెలగాటము ఐతే మరి ఎందుకు చెప్పు మోమాటము ఆడదాని మోమాటమే ఆరాటము వానాకాలం ముసిరేస్తుంటే వాటేసుకునే హక్కేఉంది ఇదివానో గాలో పొంగో వరదో రారా మలిపొద్దులు పుచ్చక సుద్దులతో ఈ వేళా మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా.. ఏదిక్కూ లేని చోటే ఏకాంతము నా దిక్కూ మొక్కూ నువ్వే సాయంత్రమూ ఇప్పట్లో వద్దూ మనకు వేదాంతము సిగ్గంటూ బుగ్గివ్వడమే సిద్దాంతము కవ్వింతల్లో కసిగా ఉంటే కౌగిలి కన్నా దారేముంది అది రైటో కాదో నైటో పగలో రావే చెలి ఆకలి తీర్చకు చూపులతో ఈ వేళా భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా.. మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా వద్దంటే వయసొచ్చి వద్దన్నా మనసిచ్చి నిద్దరకే సెలవిచ్చేయ్ ఈ వేళా.. భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా.. మావా నీ పప్పులు ఉడకవు ఆపర గోలా