చిత్రం : మరణ మృదంగం (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
ముద్దు పెట్టు ముద్దు పెట్టు పదా
ముద్దులేక పొద్దుపోని కథా
ముద్దుకాటు పడ్డ కన్నె ఎదా
విచ్చుకున్న ముద్దబంతి కథా
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుసా
చరణం 1 :
రెండు హృదయాల పిట్టపోరూ తీరనంటుంది ఎందుకో
దొంగ యోగాల కొంగగారూ గాలమేసేది ఎందుకో
చేతికందాక జాబిలీ చుక్కతో నాకు ఏం పనీ
తట్టుకున్నాక కౌగిళీ ఏమి కావాలొ చెప్పనీ
కస్సుమన్న దాని సోకు కసిగా ఉంటుందీ
తుమ్మెదొచ్చి వాలినాక పువ్వేమంటుందీ
సిగ్గో చీనీలపండు
బుగ్గో బత్తాయిపండు
అల్లో నేరేడుపండు నాదీ
అరె నా నా నా నా నా నేనే కాదంటున్నానా
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
ముద్దు పెట్టు ముద్దు పెట్టు పదా
ముద్దులేక పొద్దుపోని కథా
ముద్దుకాటు పడ్డ కన్నె ఎదా
విచ్చుకున్న ముద్దబంతి కథా
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుసా
చరణం 2 :
వయసు వడగళ్ళ వాన నీరూ వంటపట్టింది ఎందుకో
నన్ను దులిపేసి వలపు గాలీ నిన్ను తాకింది తట్టుకో
లేత అందాల దోపిడీ ఇప్పుడే కాస్త ఆపనీ
ఆపినా ఆగి చావదూ అందచందాల ఆ పనీ
ఇంతదాక వచ్చినాక ఇంకేమౌతుందీ
లబ్జు లబ్జు మోజు మీదా లంకే అంటోందీ
అబ్బొ నా బాయ్ ఫ్రెండు
ముద్దిస్తె నోరు పండు
వాటేస్తె ఒళ్ళుమండునమ్మా
అరె నా నా నా నా నా నేనే కాదంటున్నానా
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
ముద్దు పెట్టు ముద్దు పెట్టు పదా
ముద్దులేక పొద్దుపోని కథా
ముద్దుకాటు పడ్డ కన్నె ఎదా
విచ్చుకున్న ముద్దబంతి కథా
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుస
సరిగమ పదనిస రసనసా
ఇది కనివిని ఎరుగని గుసగుసా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి